Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎవ‌ర‌బ్బా ఈ కొత్త అంద‌గ‌త్తె...మ‌త్తెక్కిస్తోందే!

ఎవ‌ర‌బ్బా ఈ కొత్త అంద‌గ‌త్తె...మ‌త్తెక్కిస్తోందే!

సోష‌ల్ మీడియాలో తాజాగా ఓ అంద‌గ‌త్తె ఫొటోలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చూడ‌గానే త‌న అందంతో కుర్ర‌కారును మ‌త్తెక్కిం చేలా ఆ ఫొటోలు ఉన్నాయి. ఆ బ్యూటీ ఒక‌ప్ప‌టి ప్ర‌ముఖ హీరోయిన్ కుష్బూ అని తెలియ‌డంతో అభిమానులు షాక్‌కు గుర‌వుతున్నారు. ఒక్క‌సారిగా నాజూగ్గా క‌నిపించ‌డంతో ఈ ఫొటోలు ఎప్ప‌టివో అనే అనుమానం కూడా క‌ల‌గ‌క‌మాన‌దు.

స్లిమ్‌గా తయారైన కుష్బూ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన తొలిరోజుల‌ను గుర్తు చేశారు. ఎందుకంటే అప్ప‌ట్లో ఆమె స‌న్న‌గా నాజూగ్గా ఉండేవారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో హీరోయిన్‌గా ఆమెకు విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. పెళ్లి త‌ర్వాత ఆమెలో శారీర‌క మార్పులు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించాయి. కాస్త లావ‌య్యారు. అనంత‌రం ఆమె రాజ‌కీయాల్లోకి కూడా ప్ర‌వేశించారు.

ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు, టీవీ సీరియల్లో  బిజీగా ఉన్న కుష్బూ తాజాగా రజనీకాంత్ హీరోగా తెర‌కెక్కుతున్న అన్నాత్త చిత్రంలో ఆయనకు జంటగా నటిస్తున్నారు. కాగా లాక్‌డ‌న్ కార‌ణంగా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఆమె ఇంటిప‌ట్టునే ఉన్నారు. ఈ విరామ స‌మ‌యాన్ని కుష్బూ చ‌క్క‌గా వినియోగించుకున్నారు.

వ్యాయామం, యోగా త‌దిత‌ర ఆస‌నాల‌తో తన భారీ కాయాన్ని త‌గ్గించుకునే య‌త్నం చేశారు.  15 కిలోలు బరువు తగ్గి చాలా స్లిమ్‌గా త‌యారై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఆ ఫొటోలను సోష‌ల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. వీటిని చూసిన నెటిజ‌న్లు  కుష్బూ మళ్లీ కథానాయికగా నటిస్తుందా అని కామెంట్స్ పెడుతున్నారు. కుష్బూ కూతురు కూడా త‌ల్లిలా శ్ర‌మించి స్లిమ్‌గా తయారయ్యారు. దీంతో కుష్బూ తన కూతురుకు పోటీగా తయారైందా అనే అభిప్రాయాల‌ను అభిమానులు, నెటిజ‌న్లు స‌ర‌దాగా అంటున్నారు. 

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

గృహ‌మే లేకుండా ప్ర‌జ‌ల‌తో గృహ ప్ర‌వేశం చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?