ఏదో ఒక పిచ్చి వాగుడు వాగి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవాలనుకుంటున్న వాళ్లు పెరిగిపోయారు. ముఖ్యంగా గ్లామర్ రంగమైన సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ల గురించి మాట్లాడితే చాలు…వెంటనే సెలబ్రిటీ కావచ్చని అడ్డమైన మాటలు మాట్లాడటం పనిగా సునిశిత్ అనే వ్యక్తి పెట్టుకున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నానని అవాకులు చెవాకులు పేలిన…వెధవైన సునిశిత్‌పై బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నట్టు అసత్య ప్రచారానికి పాల్పడుతున్న సునిశిత్‌కు తమదైన శైలిలో చక్కగా లాఠీలతో ‘పెళ్లి’ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల సునిశిత్ అనే వ్యక్తి యూట్యూబ్ చానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ….మహేశ్‌బాబు, రవితేజ వంటి హీరోలపై నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. వారిద్దరూ తనకొచ్చిన అవకాశాలను కొల్లగొట్టారంటూ ఆరోపణలు చేశాడు. ఇతను హీరోయిన్‌లను కూడా విడిచిపెట్టలేదు.
హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, తమన్నాలపై సంచలన, అత్యంత వివాదాస్పద కామెంట్స్ చేశాడు. వాళ్లిద్దరిని పెళ్లి చేసుకుని, వదిలేశానని వాగాడు. ప్రముఖ హీరోయిన్లపై నిజానిజాలతో సంబంధం లేకుండా కామెంట్స్ చేసిన సునిశిత్ తాను అనుకున్నట్టుగానే సోషల్ మీడియాలో ప్రముఖుడయ్యాడు.
యూట్యూబ్ చానళ్లలో తనపై అభ్యంతరకర కామెంట్స్‌తో లావణ్య త్రిపాఠి విసిగిపోయి, అతనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తనను పెళ్లి చేసుకున్నట్టు అబద్ధాలు ప్రచారం చేయడంపై ఆమె రాతపూర్వక ఫిర్యాదును తన అసిస్టెంట్ ద్వారా ఏసీపీ కెవిఎమ్ ప్రసాద్‌కు అందజేశారు.