ఆర్థిక సాయం కోసం ప్ర‌ముఖ విల‌న్ వేడుకోలు

మెరుగైన వైద్యం చేయించుకోడానికి ఆర్థిక సాయాన్ని అందించాల‌ని ప్ర‌ముఖ విల‌న్ పాత్ర‌ధారి పొన్నంబ‌ళం వేడుకుంటున్నాడు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. తెలుగు, త‌మిళం త‌దిత‌ర భాష‌ల్లో ముఖ్యంగా విల‌న్‌గా న‌టించి…

మెరుగైన వైద్యం చేయించుకోడానికి ఆర్థిక సాయాన్ని అందించాల‌ని ప్ర‌ముఖ విల‌న్ పాత్ర‌ధారి పొన్నంబ‌ళం వేడుకుంటున్నాడు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. తెలుగు, త‌మిళం త‌దిత‌ర భాష‌ల్లో ముఖ్యంగా విల‌న్‌గా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పొన్నంబ‌ళం గ‌త ఐదేళ్లుగా అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నాడు.

చెన్నైలోని ఒక ప్ర‌యివేట్ ఆస్ప‌త్రిలో అత‌ను చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌కు …ఆ అవ‌య‌వ మార్పిడితో ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ వ‌చ్చ‌ని వైద్యులు సూచించారు. ఈ నేప‌థ్యంలో తన సహోదరి కొడుకు కిడ్నీ దానం ఇవ్వడానికి ముందుకొచ్చిన‌ట్టు పొన్నంబ‌ళం తెలిపాడు.

ప్రాణాపాయం నుంచి బ‌య‌ట ప‌డాలంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆప‌రేష‌న్ చేయించుకోవాల్సి ఉంద‌ని, కానీ త‌న కుటుంబ ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌ని వాపోయాడు. ఇప్ప‌టికే  అగ్ర‌న‌టులు  రజనీకాంత్, కమల్‌ హాసన్, రాధిక శరత్‌కుమార్, రాఘవ లారెన్స్ త‌దిత‌రులు ఆర్ధిక సహాయం చేశారని చెప్పుకొచ్చాడు.

కావున పెద్ద మ‌న‌సుతో కిడ్నీ మార్పిడి చికిత్స‌కు అవ‌స‌ర‌మ‌య్యే వైద్య ఖ‌ర్చుల‌కు సాయం అందించాల‌ని ఆయ‌న వేడుకుంటు న్నాడు.  దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్‌ తరపున తగిన ఆర్ధిక సాయం అందించాలని పేరుపేరునా అత‌ను అర్థిస్తున్నాడు. మ‌రి  పొన్నంబళం వేడుకోలును చిత్ర‌ప‌రిశ్ర‌మ ఏ మాత్రం ఆల‌కిస్తుందో చూడాలి మ‌రి!

నా సినిమాలు ఎక్కువగా ఆడ‌క‌పోవ‌డానికి కార‌ణం..?

పొలిట‌ర‌ల్ రీఎంట్రీపై జూ.ఎన్టీఆర్ రియాక్ష‌న్