5 రోజుల ముందే ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ?

థియేటర్లలో సూపర్ హిట్టయింది లియో సినిమా. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కూడా చాలామంది వెయిటింగ్. దీనికి కారణం థియేట్రికల్ వెర్షన్ కు కాస్త భిన్నంగా ఓటీటీ వెర్షన్ ఉండడమే. సినిమాతో సంబంధం…

థియేటర్లలో సూపర్ హిట్టయింది లియో సినిమా. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కూడా చాలామంది వెయిటింగ్. దీనికి కారణం థియేట్రికల్ వెర్షన్ కు కాస్త భిన్నంగా ఓటీటీ వెర్షన్ ఉండడమే. సినిమాతో సంబంధం లేకుండా, ఓటీటీ వెర్షన్ లో 18 నిమిషాల పాటు కొత్త సన్నివేశాలు ఉండబోతున్నాయనే విషయాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పటికే ప్రకటించాడు.

ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో గుడ్ న్యూస్. చెప్పిన టైమ్ కంటే కాస్త ముందుగానే లియో సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. లెక్కప్రకారం, ఈ సినిమా నవంబర్ 21న స్ట్రీమింగ్ కు రావాలి. కానీ 16వ తేదీకే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది నెట్ ఫ్లిక్స్ సంస్థ.

థియేటర్లలో లియో హంగామా దాదాపు ముగిసింది. తమిళనాడుతో పాటు ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గింది. ఇప్పటికే ఇది తమిళనాట వంద కోట్ల రూపాయల షేర్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఇలా సినిమాపై చర్చ సాగుతుండగానే ఓటీటీలోకి తీసుకురావాలనేది నెట్ ఫ్లిక్స్ ప్లాన్.

రీసెంట్ గా జవాన్ కు సంబంధించి అదనంగా కొన్ని సన్నివేశాల్ని జత చేసింది నెట్ ఫ్లిక్స్. దానికి దేశవ్యాప్తంగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ స్పందన చూసిన సదరు కంపెనీ, లియోను ముందుగానే స్ట్రీమింగ్ కు తీసుకురావాలనుకుంటోంది. వీలైతే అదనంగా కొంత మొత్తాన్ని నిర్మాతకు ఇవ్వడానికి కూడా రెడీ అయింది. త్వరలోనే లియో ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా బయటకు రానుంది.