దర్శకుడు పూరి జగన్నాధ్ స్టయిల్ అంటూ ఒకటి వుంది. హీరో ఎవరైనా ఆ స్టయిల్ లోకి వెళ్లిపోవాల్సిందే. సినిమా ఏదైనా అది పూరి స్టయిల్ లోనే వుంటుంది.
ఆగస్టులో విడుదల కాబోతున్న లైగర్ ట్రయిలర్ చూస్తే ఇవే మాటలు మరోసారి గుర్తుకు వస్తాయి. ట్రయిలర్ పక్కా పూరి స్టయిల్ లో వుంది. ఎటొచ్చీ ఈసారి పాన్ ఇండియా ఫిల్మ్ కనుక మరింత…మరింత భారీగా వుంది.
ట్రయిలర్ ఫుల్లీ ప్యాక్డ్ గా కట్ చేసారు. రిపీట్ సీన్స్ అనిపించకుండా కావాల్సిననన్ని కట్ లు యాడ్ చేసారు. అందువల్ల పక్కా పైసా వసూల్ ట్రయిలర్ అనేలా వుంది.
ట్రయిలర్ మొత్తం ఓ ఫైటర్ లైఫ్ అన్నట్లుగా యాక్షన్ సీన్లతో నింపారు. మధ్యలో పూరి స్టయిల్ అమ్మగా రమ్యకృష్ణ కనిపించారు.
హీరోయిన్ తో హీరో రొమాన్స్ సీన్లు, మైక్ టైసన్ పార్ట్ ఇంట్రస్టింగ్ గా వున్నాయి. విజువల్స్ బాగున్నాయి. లైగర్ గా విజయ్ ఫుల్ మాసీగా, మాన్లీగా కనిపించాడు. లైగర్ క్యారెక్టర్ కు కొద్దిగా నత్తి వుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ట్రయిలర్ లో అదే చూపించారు.
పాన్ ఇండియా సినిమా అన్నందుకు ఆ లెవెల్ కనిపించింది ట్రయిలర్ లో. బ్యాక్ గ్రవుండ్ స్కోర్, ర్యాప్ పక్కా సెట్ అయ్యాయి.