పెళ్లి ముచ్చట్లతో నిండిపోయిన సోషల్ మీడియా

అదేంటో.. ఉన్నట్టుండి ఒక్కసారిగా సోషల్ మీడియా పెళ్లి ముచ్చట్లతో హోరెత్తిపోతోంది. కొంతమంది పెళ్లికి రెడీ అవుతుంటే, మరికొంతమంది గడిచిన తమ పెళ్లి ముచ్చట్లను తెరపైకి తీసుకొస్తున్నారు. Advertisement ఉదాహరణకు దీపిక పదుకోన్, రణ్వీర్ సింగ్…

అదేంటో.. ఉన్నట్టుండి ఒక్కసారిగా సోషల్ మీడియా పెళ్లి ముచ్చట్లతో హోరెత్తిపోతోంది. కొంతమంది పెళ్లికి రెడీ అవుతుంటే, మరికొంతమంది గడిచిన తమ పెళ్లి ముచ్చట్లను తెరపైకి తీసుకొస్తున్నారు.

ఉదాహరణకు దీపిక పదుకోన్, రణ్వీర్ సింగ్ జోడీనే తీసుకుంటే.. వీళ్లకు పెళ్లయి చాలా కాలమైంది. కానీ ఉన్నఫలంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి సందడిలో భాగంగా దీపిక-రణ్వీర్ పై తీసిన సరదా వీడియో అది. ఆ వీడియో చూసి కరణ్ జోహార్ లాంటి డైరక్టర్ కూడా ఎమోషనల్ అయ్యాడు.

ఇక పరిణీతి చోప్రా సంగతి సరేసరి. ఆమె ఇంకా తన పెళ్లి హ్యాంగోవర్ నుంచి బయటకొచ్చినట్టు లేదు. ఈమధ్యే ప్రియుడు, ఎంపీ రాఘవ్ ను పెళ్లాడిన ఈ హీరోయిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తన 'వెడ్డింగ్ డైరీస్' షురూ చేసింది. పెళ్లిలో తను చేసిన అల్లరి, రాఘవ్ తో ఫన్నీ మూమెంట్స్ ను దశలవారీగా విడుదల చేస్తోంది.

ఇటు సౌత్ లో కూడా పెళ్లి ముచ్చట్లు బాగానే వినిపిస్తున్నాయి. సీనియర్ హీరో వెంకటేష్, తన కూతురుకు పెళ్లి ఖాయం చేశారు. ఈ మేరకు తాజాగా నిశ్చితార్థం కూడా పూర్తయింది. చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్స్ ఈ ఎంగేజ్ మెంట్ కు హాజరయ్యారు. త్వరలోనే గ్రాండ్ గా పెళ్లి చేయబోతున్నారు.

ఇక అమలాపాల్ కూడా తన పెళ్లి మేటర్ బయటపెట్టింది. జగత్ దేశాయ్ అనే వ్యక్తితో ఈ హీరోయిన్ కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఇప్పుడు అతడ్ని పెళ్లాడబోతోంది. రీసెంట్ గా అమలాపాల్ కు, జగత్ ప్రపోజ్ చేశాడు. ఆమె చేతికి ఉంగరం తొడిగాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమలాపాల్ కు ఇది రెండో పెళ్లి. ఇంతకుముందు దర్శకుడు విజయ్ ను ఆమె పెళ్లాడింది. రెండున్నరేళ్లకే విడాకులు తీసుకుంది.

లిస్ట్ లో అర్జున్ కూతురు కూడా ఉంది. హీరోయిన్ ఐశ్వర్య అర్జున్, కోలీవుడ్ నటుడు ఉమాపతి ప్రేమించుకుంటున్నారు. తాజాగా వీళ్ల ప్రేమకు పెద్దల ఆమోదం కూడా లభించింది. మరికొన్ని రోజుల్లో అర్జున్ నిర్మించిన ఆంజనేయ స్వామి గుడిలో ఐశ్వర్య-ఉమాపతి నిశ్చితార్థం చేసుకోబోతున్నారు.

ఇలా ఒకేసారి, ఇటు సౌత్ లో, అటు నార్త్ లో వరుసగా పెళ్లి ముచ్చట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ లిస్ట్ లోకి ఇంకెంతమంది చేరుతారో చూడాలి.