వాలంటైన్స్ డే సందర్భంగా హీరోయిన్లంతా తమ అభిమానుల కోసం కవ్వించే ఫొటోలు రిలీజ్ చేశారు. అయితే మాళవిక మోహనన్ మాత్రం మరో అడుగు ముందుకేసింది. రెచ్చగొట్టే ఫొటోలతో పాటు, ప్రేమ పాఠాలు మోసుకొచ్చింది.
“ఎలాంటి భాగస్వామిని ఎంచుకోవాలంటే.. భవిష్యత్తుల్లో అతడిలో మనల్ని మనం చూసుకోవాలి. అలాంటి వ్యక్తి అయితే జీవితం బాగుంటుంది. ప్రతి సక్సెస్ ఫుల్ మహిళ వెనక సపోర్ట్ చేసే మగాడు ఉంటాడనే విషయాన్ని గుర్తించుకోవాలి.”
ఇది మాళవిక మోహనన్ తొలి ప్రేమ పాఠం. రెండో ప్రేమ పాఠంలో భాగంగా పీస్ ఆఫ్ మైండ్ గురించి చెప్పుకొచ్చింది. లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మనఃశ్శాంతి లేకపోతే ఆ సంబంధం వేస్ట్ అంటోంది. ప్రతి బంధంలో ఎత్తుపల్లాలు కామన్ అని, అయితే రిలేషన్ షిప్ లో ఎత్తుల కంటే పల్లాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆలోచించుకోవాలని సూచిస్తోంది.
ఇక ముచ్చటగా మూడో ప్రేమపాఠం ఏంటంటే.. మాటలు కంటే చర్యల్ని వినాలని చెబుతోంది మాళవిక. ప్రేమ బంధంలో మాటలు చెప్పే భాగస్వామి కంటే, చేతలతో చూపించే భాగస్వామిని తను ఎక్కువగా విశ్వసిస్తానని అంటోంది.
జీవితంలో ప్రతి ఒక్కరికి లవ్ లైఫ్ ఉంటుందని, అప్పుడు ఈ పాఠాలు గుర్తు చేసుకోవాలని చెబుతోంది. తను చెప్పిన ఈ ప్రేమ పాఠాలకు, తన ఫొటోలకు సంబంధం లేదంటూ ఓ రొమాంటిక్ స్టిల్ పోస్ట్ చేసింది.