వివాదాస్ప‌ద న‌టికి మొగుడు కావాలంటే అర్హ‌త‌లివే…

పెళ్లి క‌బుర్లు చెప్ప‌డంలో రాజ‌కీయ నాయ‌కురాలు, హీరోయిన్ మాధ‌వీల‌త ఆరితేరిపోయారు. మూడు రోజులుగా ఆమె పెళ్లిపై వివిధ ప్ర‌సార సాధ‌నాల్లో వ‌స్తున్న వార్త‌ల‌పై ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చ‌దివితే…

పెళ్లి క‌బుర్లు చెప్ప‌డంలో రాజ‌కీయ నాయ‌కురాలు, హీరోయిన్ మాధ‌వీల‌త ఆరితేరిపోయారు. మూడు రోజులుగా ఆమె పెళ్లిపై వివిధ ప్ర‌సార సాధ‌నాల్లో వ‌స్తున్న వార్త‌ల‌పై ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చ‌దివితే ఆమె త‌న బ‌ల‌మైన వాద‌న చేయ‌డంలో ఎంత ప‌రిణ‌తి సాధించారో అర్థ‌మ‌వుతుంది. పెళ్లి వార్త‌ల‌పై ‘అంతా మ‌న మంచికే’ అంటున్నారామె.

అమ్మ‌డు పెళ్లిపై అనుమానం క‌లిగేలా తానే ట్వీట్ చేసి, దానిపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు రాసేందుకు అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పుడు మాత్రం త‌న ఉద్దేశం అది కాదంటూ స‌రికొత్త ముచ్చ‌ట్లు చెబుతున్నారామె. అస‌లు మాధ‌వీల‌త పెళ్లిపై క‌థ‌నాలు రావ‌డానికి కార‌ణ‌మైన ఆమె ట్వీట్ ఏంటో ముందు తెలుసుకుందాం.

‘ఎన్నో నెలల తర్వాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి. నేను ఎప్పుడూ అద్భుతాలను నమ్ముతుంటాను. చాలా సంతోషంగా ఉంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాను’ అని  మాధవీలత ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

దీంతో నెటిజ‌న్లు, అభిమానులు , జ‌ర్న‌లిస్టులు త‌మ సృజ‌నాత్మ‌క‌త‌కు ప‌దును పెట్టారు. ఊహ‌ల‌కు రెక్క‌లొచ్చాయి. దీంతో ఆమె సంతోషానికి పెళ్లే కార‌ణ‌మ‌ని రాసుకొచ్చారు. బీజేపీ నేత‌తో పెళ్లి జ‌ర‌గ‌బోతున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో త‌మ‌దైన శైలిలో మ‌సాలా జోడించి వండిపెట్టారు. అయితే త‌న‌ సంతోషానికి కారణం ‘పెళ్లి’ కాదంటూ  మాధవీలత మ‌ళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. ఈ మేర‌కు ఫేస్‌బుక్‌లో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. అదేంటో చూద్దాం.

‘ నాకు దమ్ము దైర్యం రెండూ ఎక్కువే. ప్రేమించిన పెళ్లి చేసుకున్నా దైర్యంగా చెప్తాను. అలాగే అంత దమ్ము దైర్యం ఉన్న మగాడంటేనే ఇష్టపడతా కూడా. అంతే కానీ ఇష్టాన్ని ప్రేమని దొంగలా దాచుకుని సమాజానికి భయపడే పిరికివాళ్ళంటే నాకు చిరాకు. మాధవీలతని ప్రేమిస్తున్నా… పెళ్లి చేసుకుంటా అని దమ్ముగా చెప్పే వాడితోనే స్నేహం కూడా గొప్పగా ఉంటుంది. కావున  మీడియా మిత్రులకి, నా అభిమానులకి చెప్పేది ఏమంటే కాస్త ఆగండి. తొందరపడకండి. ఏదైనా చెప్పే చేస్తాను. నేను పిరికిదాన్ని కాదు. ఆలా అని పిరికివాడిని నేను ఒప్పుకోను. కనుక ఇంకా అంత దమ్ము ,దైర్యం , సాహసం , సత్తా ,విలువ ,శక్తి , బలం , అధికారం ఉన్న మనిషి కనపడలేదు నాకు’ అని ఆమె తన ఫేస్ బుక్‌లో రాసుకొచ్చారు.

కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో మాధ‌వీల‌త చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో ఆమె వివాదాస్పద‌మ య్యారు.  న‌ట‌న కంటే ఆమె వివాదాస్ప‌ద కామెంట్స్ గుర్తింపు తెచ్చాయి. అలాంటి వివాదాస్ప‌ద న‌టి త‌న‌కు మొగుడు కావాలంటే మ‌గాడికి కావాల్సిన అర్హ‌త‌లు ఏంటో స్ప‌ష్ట ప‌రిచారు. ఇంత వ‌ర‌కూ తాను చెబుతున్న అర్హ‌త‌లు దమ్ము ,దైర్యం , సాహసం , సత్తా ,విలువ త‌దిత‌రాలున్న‌ మ‌గాడు క‌నిపించ‌లేద‌ని ఆమె అంటున్నారు. ఇంత‌కూ అలాంటి ప్ర‌త్యేక ల‌క్ష‌ణాల‌న్నీ క‌లిగిన వాడు పుట్టాడా? మాధ‌వీల‌త త‌న పెళ్లి శుభ‌వార్త ఎప్పుడు చెబుతారో మ‌రి!

చెప్పినదానికన్నా ఎక్కువ చెయ్యడం మా బలహీనత