మహేష్ సినిమా కోసం అత్యంత భారీ సెట్

ఇప్పటి వరకు టాలీవుడ్ లో వేయనంత భారీ ఇంటి సెట్ నిర్మాణం జ‌రుగుతోంది.  Advertisement మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమాను నిర్మిస్తోంది హారిక హాసిని సంస్థ. ఈ సినిమా తొలి షెడ్యూలు…

ఇప్పటి వరకు టాలీవుడ్ లో వేయనంత భారీ ఇంటి సెట్ నిర్మాణం జ‌రుగుతోంది. 

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమాను నిర్మిస్తోంది హారిక హాసిని సంస్థ. ఈ సినిమా తొలి షెడ్యూలు ఇటీవలే సారథి స్టూడియోలో ముగిసింది. ఇందుకోసం సారథి స్టూడియోలో పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఓ ఓల్డ్ మోడల్ డాబా ఇల్లు సెట్ వేసారు.

ఈ సినిమా రెండో షెడ్యూలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం నగర శివార్లలో ఓ భారీ ఇంటి సెట్ నిర్మాణం జోరుగా జ‌రుగుతోంది. దాదాపు 10 కోట్ల రూపాయలను ఇందుకోసం వెచ్చిస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఇంత భారీ ఇంటి సెట్ నిర్మాణం చేయలేదు అనేంత రేంజ్ లో ఈ సెట్ ను నిర్మిస్తున్నారు. కొన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెట్ వుంటుంది. అది కూడా కేవలం ఒక్క ఫ్లోర్ మాత్రమే అని తెలుస్తోంది.

థమన్ సంగీతం అందిస్తున్న మహేష్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమాను చకచకా ఫినిష్ చేసి రాజ‌మౌళి సినిమా మీదకు వెళ్లాలని హీరో మహేష్ బాబు మార్నింగ్ టు ఈవెనింగ్ వర్క్ చేస్తున్నారు. తొలి షెడ్యూలు అంతా కూడా మార్నింగ్ సెవెన్ కే సెట్ కు వచ్చేసారు. ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా వర్క్ చేసారు.