ఆ ఏడుపులు, పెడబొబ్బలు ఇప్పుడేమయ్యాయి

బిగ్ బాస్ హౌజ్ అంటేనే ఏడుపుల కార్యక్రమంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఎవరైనా ఎలిమినేట్ అవుతున్నారంటే చాలు కన్నీటితో హౌజ్ తడిసిముద్దయిపోయేదు. అంతా ఒకటే ఏడుపులు, పెడబొబ్బలు. అదంతా స్క్రిప్టింగా లేక నిజమా అనే…

బిగ్ బాస్ హౌజ్ అంటేనే ఏడుపుల కార్యక్రమంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఎవరైనా ఎలిమినేట్ అవుతున్నారంటే చాలు కన్నీటితో హౌజ్ తడిసిముద్దయిపోయేదు. అంతా ఒకటే ఏడుపులు, పెడబొబ్బలు. అదంతా స్క్రిప్టింగా లేక నిజమా అనే విషయాన్ని పక్కనపెడితే.. హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయే పార్టిసిపెంట్లకు మాత్రం మంచి సెండాఫ్ దొరికేది. కానీ మహేష్ విట్టా విషయానికొచ్చేసరికి మాత్రం అదంతా ఒక్కసారిగా మాయమైంది.

బిగ్ బాస్ సీజన్-3 క్లైమాక్స్ కు వస్తున్న వేళ.. నిన్న జరిగిన కార్యక్రమంలో మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. సోషల్ మీడియా లీకుల్ని నిజం చేస్తూ, ఎలాంటి సంచలనాలు లేకుండా మహేష్ ను ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. అయితే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ మాత్రం సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చకు తావిచ్చింది. హౌజ్ లో 2-3 వారాలు ఉండి వెళ్లిపోయిన పార్టిసిపెంట్లపై అపారమైన ప్రేమను కురిపించిన ఇతర పార్టిసిపెంట్లు, దాదాపు 12 వారాల పాటు హౌజ్ లో ఉంటూ అందరికీ వినోదాన్ని పంచిన మహేష్ విషయంలో మాత్రం నిర్లిప్తంగా ఉండిపోయారు.

మహేష్ బయటకు వెళ్లిపోతుంటే, బాబా భాస్కర్ మినహా ఎవ్వరూ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అందరూ నవ్వుతూ అతడ్ని సాగనంపారు. తమకు పోటీగా, అడ్డంకిగా ఉన్న ఓ వ్యక్తి బయటకు వెళ్లిపోయాడనే ఆనందం మాత్రమే వాళ్లలో కనిపించింది. ఇది నిజంగా బాధాకరం. ఉన్నంతలో బాబా భాస్కర్ మాత్రం తన బాధను వ్యక్తంచేశాడు.

హౌజ్ నుంచి బయటకు వెళ్తూ మహేష్ కూడా అతడి కాళ్లకు నమస్కరించి మరీ వెళ్లిపోయాడు. ఇక బయటకొచ్చిన తర్వాత మహేష్ విట్టా తనదైన జోస్యం చెప్పాడు. బిగ్ బాస్ టైటిల్ బాబా భాస్కర్ దే అంటున్నాడు. అంతేకాదు.. రెగ్యులర్ గా వేసే బిగ్ బాంబ్ శిక్షను శ్రీముఖిపై వేస్తూ వెళ్లిపోయాడు. మొత్తమ్మీద మహేష్ కు మాత్రం బిగ్ బాస్ హౌజ్ నుంచి సరైన వీడ్కోలు దక్కలేదు.

జ్ఞానం రాత్రికి రాత్రి రాదు.. విద్యార్జన నిరంతర ప్రక్రియ