మహేష్ బాబు కు మూడు నెలల ట్రైనింగ్

మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా సెట్ మీద వుండగానే, రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ లు కాగితాల మీద రెడీ అయిపోతున్నాయి. ఫుల్ యాక్షన్ సినిమాగా తయారు అవుతుందని వార్తలు వున్నాయి.  Advertisement ఈ…

మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా సెట్ మీద వుండగానే, రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ లు కాగితాల మీద రెడీ అయిపోతున్నాయి. ఫుల్ యాక్షన్ సినిమాగా తయారు అవుతుందని వార్తలు వున్నాయి. 

ఈ సినిమా కోసం రాజమౌళి మూడు నెలలపాటు మహేష్ బాబు కు ఓ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసారట. మరి అది ఇక్కడే వుంటుందా? విదేశాల్లో వుంటుందా? అన్న క్లారిటీ లేదు కానీ, మొత్తం మీద డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ ప్రోగ్రామ్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ట్రైనింగ్ షెడ్యూలు మారదని తెలుస్తోంది. అందుకే మహేష్-త్రివిక్రమ్ సినిమాకు నవంబర్ నాటికి పూర్తి చేయాలని పక్కాగా షెడ్యూళ్లు వేసారు. మహేష్ గ్యాప్ తీసుకునే టైమ్ లో కూడా షూటింగ్ పెట్టి, ఆయన లేని సీన్లు పూర్తి చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ ఎండ్ కు టాకీ వర్క్ పూర్తి చేసి, నవంబర్ లో సాంగ్స్ చేయాలని ప్లాన్.

తన సినిమాకు సంబంధించి రిహార్సల్ చేయించడం, హీరోలు పాత్రల్లో ఒదిగిపోయేలా ట్రైనింగ్ ఏర్పాటు చేయడం, వర్కషాప్ లు నిర్వహించడం అన్నది రాజమౌళి స్టయిల్. ఆర్ఆర్ఆర్ తరువాత చేయబోయే సినిమాకు కూడా అదే స్టయిల్ పాలో అవుతున్నారు.