గ్యాప్ దొరికితే విదేశాలకు వెళ్లడం సూపర్ స్టార్ మహేష్ బాబు కు అలవాటు. అది ఫ్యామిలీతో వెకేషన్ కు అయినా కావచ్చు. లేదా పర్సనల్ పనలు కావచ్చు. కాదూ అంటే మెడికల్ పర్పస్ కావచ్చు. మొత్తానికి గ్యాప్ దొరకడమే పాపం..దొరికిందా ఛలో అన్నమాట.
ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. అది జస్ట్ ఒక షెడ్యూలు అయింది అనిపించారు. అది కూడా అర్థాంతరంగా ఆగింది. ఇంతలో మహేష్ ఇంట్లో విషాదం. తల్లి ఇందిరా దేవి కన్నుమూసారు. ఆ పన్నెండు రోజుల కార్యక్రమాలు, కాశీ వెళ్లిరావడం ఇలా జరిగిపోయింది.
ఇక ఇవ్వాళో, రేపో సెట్ మీదకు వస్తారు అనుకుంటే..ఇప్పుడు మళ్లీ విదేశాలకు వెళ్తున్నట్లు బోగట్టా. అయితే ఫ్యామిలీతో కాదు, సింగిల్ గా వెళ్తున్నారని తెలుస్తోంది. మెడికల్ కన్సల్టింగ్ కు సంబంధించిన పనుల మీద విదేశాలకు మహేష్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అది పూర్తి చేసుకుని వచ్చాక, త్రివిక్రమ్ సినిమా షూట్ మళ్లీ ప్రారంభం అవుతుంది.
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ తో చాలా ఏళ్ల తరువాత చేస్తున్న సినిమా. మహేష్ కు కూడా పక్కా సూపర్ బ్లాక్ బస్టర్ కావాలన్న కోరిక ఫ్యాన్స్ కు వుంది. సర్కారు వారి పాట ఫ్యాన్స్ కు సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే వారు త్రివిక్రమ్ సినిమా మీదే ఆశలు అన్నీ పెట్టుకున్నారు. 2023 సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమా స్టార్ట్ చేసారు. డేట్ కు ఇచ్చారు. అయితే ఆ డేట్ కు అయితే రాదు అన్నది పక్కా.