Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ విదేశాలకు మహేష్ బాబు

మళ్లీ విదేశాలకు మహేష్ బాబు

గ్యాప్ దొరికితే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లే ఏకైక టాలీవుడ్ హీరో మహేష్ బాబు. "నేను నా ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్తే మీకేంటి ప్రాబ్లమ్" అంటూ ఓ ప్రెస్ మీట్ లో సూటిగానే స్పందించాడు మహేష్. ఇక్కడ సమస్య అది కాదు. మహేష్ బాబు ఎప్పుడు కావాలంటే అప్పుడు తన కుటుంబంతో విహార యాత్రకు వెళ్లొచ్చు. కానీ రాజమౌళి సినిమాపై ఓవైపు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న టైమ్ లో మహేష్ విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశమైంది.

మహేష్-రాజమౌళి సినిమాను రేపోమాపో ప్రకటిస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎప్పట్లానే ప్రెస్ మీట్ పెట్టి  ఈ ప్రాజెక్టును ఘనంగా ఎనౌన్స్ చేస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో మహేష్ బాబు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లడంతో అతడి ఫ్యాన్స్ మరోసారి నిరాశ చెందారు. బహుశా, మహేష్ తిరిగొచ్చిన తర్వాత ప్రకటన చేస్తారేమో.

సమ్మర్ లో మహేష్ కచ్చితంగా విదేశాలకు వెళ్తాడు. ఎందుకంటే, పిల్లలకు అప్పుడే వేసవి శెలవులు ఇస్తారు కాబట్టి. అదే విధంగా ఈసారి కూడా వెళ్లాడు. గతేడాది గుంటూరుకారం సినిమా షూటింగ్ టైమ్ లో కూడా మహేష్ ఇలానే చేశాడు.

కాబట్టి అతడి ప్లానింగ్ అతడికి ఉంది. మరీ ముఖ్యంగా రాజమౌళికి చెప్పకుండా మహేష్ ఈ వెకేషన్ ప్లాన్ చేసి ఉండడు. సో.. రాజమౌళితో ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించడానికి ఇంకొన్ని రోజులు టైమ్ పట్టేలా ఉంది. ఈ గ్యాప్ లో ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేస్తున్నాడు జక్కన్న. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?