పవన్ కల్యాణ్ క్రిస్మస్ కానుకలు

పవన్ కల్యాణ్ నుంచి ఎవరికైనా బహుమతులు అందాయంటే అది సమ్మర్ అయి ఉండాలి. ఎందుకంటే, ప్రతి వేసవికి తన ఫామ్ హౌజ్ లో సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను.. టాలీవుడ్ లో కొంతమందికి…

పవన్ కల్యాణ్ నుంచి ఎవరికైనా బహుమతులు అందాయంటే అది సమ్మర్ అయి ఉండాలి. ఎందుకంటే, ప్రతి వేసవికి తన ఫామ్ హౌజ్ లో సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను.. టాలీవుడ్ లో కొంతమందికి ప్రత్యేకంగా పంపిస్తుంటాడు పవన్. ఈ హీరో నుంచి టాలీవుడ్ ప్రముఖులకు అందే రెగ్యులర్ బహుమతులు ఇవే. అయితే ఈసారి పవన్ కాస్త స్టయిల్ మార్చాడు.

ఈసారి క్రిస్మస్ కు కూడా బహుమతులు పంపించాడు పవన్. అయితే చాలా కొద్దిమందికి మాత్రమే. ఇలా పవన్ నుంచి క్రిస్మస్ కానుకలు అందుకున్న వాళ్లలో.. మహేష్ బాబు ఉన్నాడు. పవన్, అతడి భార్య అన్న లెజ్నెవా నుంచి తమకు అదిరిపోయే క్రిస్మస్ కానుక అందిందంటూ నమ్రత, తన సోషల్ మీడియా పేజీలో చెప్పుకొచ్చారు.

మహేష్ దంపతులతో పాటు కొత్తగా పెళ్లి చేసుకున్న రానా దంపతులు, నితిన్ దంపతులు కూడా పవన్ నుంచి ఈసారి క్రిస్మస్ కానుకలు అందుకున్నారు. పవన్ నుంచి అందుకున్న కానుకల్ని సోషల్ మీడియాలో పెట్టిన ఈ హీరోలు.. పవన్ తో పాటు అన్నాకు థ్యాంక్స్ చెప్పారు.

ప్రతి క్రిస్మస్ కు పవన్ భార్య అన్నా లెజ్నెవా, తన సొంత దేశం రష్యాకు వెళ్లిపోతారు. అయితే ఈసారి మాత్రం ఆమె క్రిస్మస్ ను ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈమేరకు కొన్ని రోజుల కిందటే ఆమె తన దేశం నుంచి హైదరాబాద్ వచ్చేశారు. 

సోహైల్ చాలా తెలివైనోడు