మారుతి-ప్రభాస్… హిలేరియస్ మూవీ

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా, సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఈ మూవీ జానర్ ఏంటనేది కూడా ఎవ్వరికీ తెలియదు.…

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా, సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఈ మూవీ జానర్ ఏంటనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి కొన్ని విశేషాలు బయటపెట్టాడు నటుడు 'రంగస్థలం' మహేష్.  

మారుతి సినిమాల్లో కామెడీ కామన్. కామెడీ లేకుండా ఈ దర్శకుడి సినిమాల్ని ఊహించుకోలేం. ప్రభాస్ సినిమా కూడా అదే జానర్ లో సాగుతుందని చెబుతున్నాడు మహేష్. కామెడీతో పాటు.. మిస్టర్ పెర్ ఫెక్ట్, డార్లింగ్ సినిమాల్లో కనిపించిన ప్రభాస్ ఎనర్జీ.. మారుతి సినిమాలో కనిపిస్తుందని అంటున్నాడు.

ఇక ప్రభాస్ లుక్ పై కూడా చిన్న హింట్ ఇచ్చాడు. ఆమధ్య బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ప్రభాస్ హాజరయ్యాడు. దాదాపు అదే లుక్ మారుతి సినిమాలో కూడా ఉండబోతోందని, కాకపోతే మరింత స్టయిలిష్ గా ఉంటుందని అంటున్నాడు 'రంగస్థలం' మహేష్.

ఎప్పట్లానే ఈ సినిమా సెట్స్ లో కూడా ఫుడ్ ఫెస్టివల్ నడుస్తోందని అంటున్నాడు మహేష్. సెట్స్ లో వంద మంది ఉంటే, అందరికీ ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వస్తుందని తెలిపాడు. ఓసారి ప్రభాస్, రంగస్థలం మహేష్ ను పిలిచి ఏం నచ్చిందని అడిగాడట. మటన్ బాగుందని మహేష్ చెబితే.. ఆ మరుసటి రోజు మటన్ లో మరిన్ని వెరైటీలో చేయించి మహేష్ కు వడ్డించాడట ప్రభాస్.