ఏదైనా కొత్త పాయింట్ చెప్పు మహేష్ బాబు!

సరిలేరు నీకెవ్వరు.. ఈ సినిమా ప్రచారం ప్రారంభమైనప్పట్నుంచి, రాత్రి జరిగిన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ వరకు మహేష్ మాటల్లో ఒక్కటంటే ఒక్క కొత్త పాయింట్ కూడా కనిపించ లేదు. ప్రమోషన్ మొదటి రోజు ఏదైతే…

సరిలేరు నీకెవ్వరు.. ఈ సినిమా ప్రచారం ప్రారంభమైనప్పట్నుంచి, రాత్రి జరిగిన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ వరకు మహేష్ మాటల్లో ఒక్కటంటే ఒక్క కొత్త పాయింట్ కూడా కనిపించ లేదు. ప్రమోషన్ మొదటి రోజు ఏదైతే మాట్లాడాడో, సక్సెస్ మీట్ లో కూడా అదే మాట్లాడాడు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పి అందర్నీ విసిగించాడు. 

ఈ సినిమా కోసం దాదాపు 10 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటాడు మహేష్. ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిందే చెప్పాడు. ఒక్క మాట కూడా ఎక్స్ ట్రా చెప్పలేదు. కొత్తగా ఒక్క పాయింట్ కూడా యాడ్ చేయలేదు. విజయశాంతి గురించి మాట్లాడితే కొడుకు దిద్దిన కాపురం సినిమా, దిల్ రాజు గురించి మాట్లాడితే హ్యాట్రిక్, అనీల్ రావిపూడి గురించి మాట్లాడితే 40 నిమిషాల నెరేషన్, దేవిశ్రీ గురించి మాట్లాడితే మైండ్ బ్లాక్ సాంగ్.. ఇలా వేసిన క్యాసెట్టే మళ్లీ మళ్లీ వేశాడు మహేష్. 

నిన్నటి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో మహేష్ నుంచి కొత్తగా ఏదైనా ఉందంటే అది కేవలం స్టేజ్ పై ఆఖర్లో అతడు చెప్పిన డైలాగ్ మాత్రమే. “మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు, మీ అభిమానానికి టేక్ ఏ బౌ” అంటూ డైలాగ్ చెప్పాడు మహేష్. ఇది తప్ప గడిచిన 3 వారాల్లో మహేష్ స్పీచ్ లో కొత్తగా ఏమీ లేదు. 

అన్నట్టు ఈ సినిమాకు సంబంధించి మరో లాంఛనం కూడా పూర్తిచేశారు. వరల్డ్ వైడ్ ఈ సినిమా వంద కోట్ల రూపాయల షేర్ సాధించినట్టు ప్రకటించుకున్నారు. విడుదలైన వారం రోజులకే ఈ ఘనత సాధించినట్టు చెప్పుకున్నారు.

బిగ్ స్టోరి:తెర తొలిగింది