Advertisement

Advertisement


Home > Movies - Movie News

మహేష్ సరసన శ్రీలీల

మహేష్ సరసన శ్రీలీల

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలో రెండో హీరోయిన్ వుండడం కామన్. త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా లో కూడా రెండో హీరోయిన్ పాత్ర వుంది, ఆ పాత్ర కు శ్రీలీల ను తీసుకున్నారు. 

కుర్రకారు గుండెల్ని తన పెళ్లి సందడి సినిమాతో పట్టేసిన అమ్మడు శ్రీలీల. ఆ వెంటనే రవితేజ సరసన సైన్ చేసింది. ఇప్పుడు ఏకంగా మహేష్ సినిమాలోకి చేరిపోయింది.

త్రివిక్రమ్ ఓ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాను మహేష్ తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ తొలి వారం నుంచి సెట్ మీదకు వెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ హీరోయిన్ గా వుంది. రెండో హీరోయిన్ గా శ్రీలీల అన్నమాట. అలాగే ఈ సినిమా కోసం ఓ సీనియర్ హీరోయిన్ కూడా కీలక పాత్రకు తీసుకుంటున్నారు.

ఇవన్నీ ఇలా వుంచితే తొలిసారి త్రివిక్రమ్ ఓ ప్యూర్ ఐటమ్ సాంగ్ ను తన సినిమాలో చూపించబోతున్నారు. రష్మిక లేదా ఆ రేంజ్ హీరోయిన్ కోసం ఆలోచిస్తున్నారు. మహేష్ తో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ సినిమా అందివ్వాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది ఈ ఏర్పాట్లు అన్నీ గమనిస్తుంటే. ఈ సినిమాకు చినబాబు నిర్మాత...నాగవంశీ నిర్వహణ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?