Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ అదే కాంబినేషన్ మరోసారి

మళ్లీ అదే కాంబినేషన్ మరోసారి

ఫ్లాపుల్లో వున్న నితిన్ ను హిట్ బాటలోకి మార్చిన సినిమా ఇష్క్. విక్రమ్ కే కుమార్ దర్శకుడు. అప్పటి వరకు వీర మాస్ సినిమాలే ఎక్కువగా చేసుకుంటూ వచ్చాడు నితిన్. మాంచి ఫీల్ గుడ్, ఫల్ ఎంటర్ టైనర్ లవ్ స్టోరీ అయితే రిజల్ట్ ఇలా వుంటుంది అని తెలియచెప్పింది ఇష్క్. అలాగే తరువాత చేసిన గుండె జారి గల్లంతయ్యిందే, అ ఆ, భీష్మ సినిమాలు నితిన్ ను ఎలాంటి సినిమాల్లో జనం చూస్తారో క్లారిటీ ఇచ్చాయి.

కానీ నితిన్ మాత్రం మళ్లీ తను నమ్మిన మాస్ సినిమాల బాటలోనే వెళ్లారు. ఇప్పుడు మళ్లీ హిట్ ఎలా వస్తుందా? ఎటునుంచి వస్తుందా అని చూస్తున్నారు. చేతిలో రెండు సినిమాలు వున్నాయి. వెంకీ కుడుమల ‘రాబిన్ హుడ్’, వేణు శ్రీరామ్ ‘తమ్ముడు’. వీటిలో తమ్ముడు ఫుల్ యాక్షన్, రాబిన్ హుడ్ సెమీ యాక్షన్.

ఈ రెండూ కాకుండా మళ్లీ మరోసారి తనకు సరైన హిట్ రూట్ చూపించిన దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో ఓ సినిమా చేయడానికి ఓకె అన్నారు. హనుమాన్ తో కొట్ల రూపాయిలు అక్కౌంట్లో వేసుకున్న నిరంజన్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత.

మొత్తం మీద మూడు ప్రామిసింగ్ ప్రాజెక్టుల్తో నితిన్ తన కెరెర్ ను బాగానే ట్రాక్ మీదకు తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంకా ఇలా ట్రాక్ మీదకు రాలేక, పక్కన వుండిపోతున్న మిడ్ రేంజ్ హీరోలు చాలా మందే వున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?