జనాల అభిరుచి మారుతోంది. అమ్మ.. నాన్న.. అత్త.. అల్లుడు.. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి టైపు సినిమాలు చూడడం లేదు. సమ్ థింగ్ డిఫరెంట్ గా వుంటేనే చూస్తున్నారు. ఆదరిస్తున్నారు. థియేటర్ కు వస్తున్నారు.
ఇలాంటి సినిమా మరోటి వస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళంలో లవర్ పేరుతో తయారవుతున్న సినిమాను తెలుగులో ట్రూ లవర్ పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు దర్శకుడు మారుతి.. నిర్మాత ఎస్కేఎన్ కలిసి. ఈ సినిమా సబ్జెక్ట్ విని, కంటెంట్ చాలా వరకు చూసి ఈ ఇద్దరూ తెలుగులో అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఈ రోజు విడుదల చేసారు.
టీజర్ అండ్ అవుట్ కాంటెంపరరీ యూత్ టార్గెట్ గా తయారు చేసిన సబ్జెక్ట్ లా వుంది ట్రూ లవర్ సినిమా. మణికందన్, గౌరీప్రియ లీడ్ రోల్స్ నటించిన ఈ సినిమా ఒక డిఫరెంట్ ప్రేమ కథతో తయారవుతున్నట్లు క్లారిటీ వచ్చింది. టూ కేరింగ్, టూ ఎమోషనల్, టూ లవ్ ఇవన్నీ వైపరీత్యానికి దారి తీస్తాయి. దాన్ని ట్రూ లవ్ అని అంటే అనుకోవచ్చు కానీ, దాని వల్ల ఇబ్బందులే తప్ప, ఇష్టం పెరగదు.
సినిమా కచ్చితంగా ఈ జనరేషన్ యూత్ కు నచ్చే సబ్జెక్ తోనే తయారవుతోంది. సినిమా ఎలా వచ్చిందన్న దాన్ని బట్టి ఫలితం వుంటుంది. ఈ నెలలలోనే ఈ సినిమా విడుదలవుతుంది.