మళ్లీ తెరపైకి పవన్-మైత్రీ-హరీష్-తెరి!

కొన్ని సినిమా ప్రాజెక్టులు బేతాళ కథలను తలపిస్తుంటాయి. పట్టువదలని విక్రమార్కుడు భేతాళుడిని చెట్టు మీద నుంచి దింపుతుంటాడు. కానీ భేతాళుడు ఏదో కథ చెప్పి మాయ చేసి మళ్లీ చెట్టుమీదకు ఎగిరిపోతుంటాడు. పవర్ స్టార్…

కొన్ని సినిమా ప్రాజెక్టులు బేతాళ కథలను తలపిస్తుంటాయి. పట్టువదలని విక్రమార్కుడు భేతాళుడిని చెట్టు మీద నుంచి దింపుతుంటాడు. కానీ భేతాళుడు ఏదో కథ చెప్పి మాయ చేసి మళ్లీ చెట్టుమీదకు ఎగిరిపోతుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-మైత్రీ మూవీస్-మాస్ దర్శకుడు హరీష్ శంకర్ సినిమా సంగతి ఇలాగే వుంది. ఈ సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో వుంటూ వస్తోంది. భవదయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేసారు.

కానీ కథ సెట్ కాలేదని, లేదా కథ నచ్చలేదని, ఇలా రకరకాల వార్తలు వినిపిస్తూ వచ్చాయి. రాజకీయాల్లో బిజీ అయిపోతూ వుండడం వల్ల క్రిష్ డైరక్షన్ లోని హరి హర వీరమల్లు సినిమా తప్ప మిగిలినవి పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి. హరీష్ శంకర్ కూడా రామ్, విజయ్ దేవరకొండ, సల్మాన్ ఖాన్ ఇలా వేరే హీరోలను ట్రయ్ చేస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి.

ఇలాంటి నేపథ్యంలో మైత్రీతో సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, పూజ కూడా చేసుకోమని చెప్పేసారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. తెరి సినిమా రీమేక్ తన విజన్ లో ఎలా వుంటుందో హరీష్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ మేరకు పవన్ సరే స్క్రిప్ట్ చేయమని చెప్పినట్లు బోగట్టా.

కానీ ఒకటే సమస్య పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఎప్పుడు సినిమా చేస్తారో? ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా వుంటారో అన్నదే. ఆ ఆటుపోట్లు తట్టకుంటూ సినిమా ఫినిష్ చేయాల్సి వుంటుంది.