కెరీర్ లాగించడం కష్టంగా మారినప్పుడు పర్సనల్ లైఫ్ లోనైనా సెటిల్ అవ్వాలి. హీరోయిన్లంతా ఇదే యాంగిల్ లో ఆలోచిస్తుంటారు కాబట్టే ఎంచక్కా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటరైన అర్చన బాటలో ఇప్పుడు మరో హీరోయిన్ చేరింది. ఆమె పేరు మనాలీ రాథోడ్.
వంశీ డైరక్ట్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాతో ఈమెకు కాస్త గుర్తింపు వచ్చింది. అయితే ఆ క్రేజ్ ఆమెకు సరిపోలేదు. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్, ఓ స్త్రీ రేపు రా లాంటి సినిమాలు చేసినప్పటికీ ఆమెకు కలిసిరాలేదు. ఒక దశలో బికినీ వేసి అందాలు ఆరబోసినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు కోలీవుడ్ కు వెళ్లినా ఫలితం శూన్యం.
దీంతో మనాలి లైఫ్ లో సెటిల్ అయిపోయింది. రవి విజ్జిత్ అనే ఔత్సాహిక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. సినిమాల్లేకపోయినా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ బ్యూటీ, త్వరలోనే తన కెరీర్ ప్లానింగ్స్ ను చెబుతానంటోంది.
కొన్నాళ్లు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసిన తర్వాత మనాలీ, కొత్త ప్లానింగ్ ఏంటనేది తెలుస్తుంది. ఈమె పెళ్లికి రాజశేఖర్ దంపతులు, హేమతో పాటు పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు.