మోహన్‌బాబు తనయ మంచు లక్ష్మితో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం వెబ్‌సిరీస్ తీస్తున్నాడు. రాజకీయ నేపథ్యంతో చక్కటి కథతో తరుణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. తరుణ్ భాస్కర్‌కు 2016లో విడుదలైన పెళ్లి చూపులు చిత్రం మొట్ట మొదటిది. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంతో పాటు ఉత్తమ మాటల రచయితగా భాస్కర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు.
షార్ట్ ఫిల్మ్‌లతో సినీ ప్రస్థానాన్ని భాస్కర్ ప్రారంభించాడు. సైన్మా, అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్‌లు భాస్కర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్‌ను యూట్యూబ్‌లో లక్షలాది మంది వీక్షించారు. అలాగే సైన్మాకి అనేక అవార్డులు లభించాయి.
సైన్మాని చూసిన మంచు లక్ష్మి తనతో ఓ చిత్రానికి పనిచేయాలని కొన్నేళ్ల క్రితమే కోరారు. లక్ష్మితో సినిమా తీసే క్రమంలో స్క్రిప్ట్ రెడీ చేసుకుంటుండగా భాస్కర్ తండ్రి మరణించారు. దీంతో వారి ప్రాజెక్టు వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పటికి కాలం కలిసి వచ్చింది. పూర్తిగా రాజకీయ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి ప్రస్తుతం సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది.
తరుణ్ భాస్కర్ ప్రతిభపై నమ్మకంతో ఏరికోరి ప్లాన్ చేసిన వెబ్ సిరీస్ మంచు లక్ష్మికి ఎలాంటి క్రేజ్ తెస్తుందో వేచి చూడాలి.