మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. అసలేం జరిగిందనేది పూర్తిగా తెలియలేదు కానీ.. విష్ణు ఇళ్లలోకి చొరబడి తన వాళ్లను, బంధువుల్ని ఇలా కొడుతుంటాడని, ఇది సిచ్యుయేషన్ అంటూ మనోజ్ తన ఫేస్ బుక్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు.
మనోజ్ దగ్గర పనిచేస్తున్న సారథి అనే వ్యక్తిని కొట్టడానికి విష్ణు అతడి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మనోజ్ అక్కడే ఉండటంతో ఆయనే విష్ణు వీడియో తీసినట్లు సమాచారం.
గత కొన్నాళ్లుగా విష్ణు, మనోజ్ మధ్య మనస్పర్దలు ఉన్నాయి. ఇటీవల మంచు మనోజ్ పెళ్లి భూమా మౌనికతో జరిగింది. అది కూడా లక్ష్మీ మంచు ఇంట్లోనే జరిగింది. ఆ పెళ్లికి మోహన్ బాబు, విష్ణు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అయితే విష్ణు అతిథిలా వచ్చి వెళ్లిపోవటం హాట్ టాపిక్‌గా మారింది.