
మంచు బ్రదర్స్ మధ్య వివాదంపై మంచు విష్ణు స్పందించారు. ఓ మీడియాతో మంచు విష్ణు మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య గొడవలు సాధారణమేనని.. అది నిన్న ఉదయం జరిగిన చిన్న ఘటన అని.. సారథితో వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడు. అందుకే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మనోజ్ చిన్న వాడు, వీడియో గురించి స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు అంటూ విష్ణు వివరణ ఇచ్చారు.
మరో వైపు వివాదం గురించి తాను విష్ణు, మనోజ్ లతో మాట్లాడిన తర్వాత స్పందిస్తానని మంచు లక్ష్మి తెలిపారు. కాగా వీరి గొడవపై మోహన్ బాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మనోజ్ కు మోహన్ బాబు పోన్ చేయడంతో మనోజ్ షేర్ చేసిన వీడియోను డిలీట్ చేశారు. అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని, ఆవేశం అన్నింటికీ అనర్థమని తాను ఎన్నోసార్లు చెప్పానట్లు మోహన్ బాబు వివరించారు.
కాగా మంచు విష్ణు.. మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేస్తుండటంతో తీసిన వీడియోని తన ఫేస్ బుక్ స్టోరీలో పెట్టి.. విష్ణు ఇలా వచ్చి అప్పుడప్పుడు నా మనుషులను కొడతాడు అని మనోజ్ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా