తన కుటుంబంపై వస్తున్నా ట్రోలింగ్స్ పై తీవ్ర స్ధాయిలో స్పందించారు మంచు విష్ణు. మా ఎన్నికలప్పుడు తనను, తన కుటుంబాన్ని ఎంతో మంది ట్రోల్స్ చేశారని, వారెవ్వరిని వదలమని హెచ్చరించారు. ఈ ట్రోల్స్ వెనుకు ఒక ప్రముఖ హీరో ఉన్నరంటూ, ఇకపై అలాంటివి అపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇవాళ తన సినిమా ప్రమోషన్స్ భాగంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ మా ఎన్నికలప్పటి నుంచి మా ఫ్యామిలీపై ట్రోల్స్ ఎక్కువయ్యాయని, ట్రోల్స్ చేసినవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన 18 మంది యూట్యూబ్ ఛానెల్స్ మీద కేసు వేసి వారి ఛానెల్స్ ను బ్యాన్ చేయిస్తానని హెచ్చరించారు.
రూమర్స్, హీరో హీరోయిన్ల మధ్య గాసిప్స్ రావడం సహజమేనని అలాంటివి రాసుకోండి.. కానీ బతికున్నవారిని చంపేలాంటివి మానుకోండి హెచ్చరించారు. ట్రోల్స్ అందరిని నవ్వించేవిగా ఉండాలి కానీ ఇలా ఎదుటివారు బాధపడేలా ఉండకూడదని చెప్పుకొచ్చాడు.
ట్రోల్స్ వెనుక ఎవరు ఉన్నారు అనేది చెప్పకనే చెప్పారు. ఇకపై నుండి అయిన మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ అగుతాయా లేదా అనేది అసక్తికరంగా కనిపిస్తోంది.