Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరోసారి కృతిశెట్టితో...

మరోసారి కృతిశెట్టితో...

కృతి శెట్టి హాట్ ఫేవరెట్ అయిపోయినట్లుంది హీరో నాగ్ చైతన్యకు. తన సరసన వెంటనే రెండో సారి చాన్స్ ఇచ్చేసాడు. బంగార్రాజు సినిమా తరువాత మరో చాన్స్ దొరికింది కృతి శెట్టికి చైతన్య సరసన.  

ప్రస్తుతం థాంక్యూ సినిమా విడుదలకు రెడీగా వుంది. ఈ సినిమా తరువాత వెంకట్ ప్రభు డైరక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

ఈ సినిమాకు ఈ గురవారం శ్రీకారం చుట్టబోతున్నారు. వెంకట్ ప్రభు తొలిసారి తెలుగులో చేయబోతున్న సినిమా ఇది. తన తొలి సినిమా సరోజ తరువాత నుంచి ట్రయ్ చేస్తున్నాడు తెలుగులో సినిమా చేయాలని. 

నిజానికి ఇటీవల హిట్ అయిన తమిళ సినిమా మానాడు తెలుగులోనే చేయాల్సి వుంది. కానీ తెలుగు హీరోలు ఎవ్వరకీ ఆ కథ, కాన్సెప్ట్ నచ్చలేదు. 

ఇప్పుడు చైతన్య మరి ఆ సినిమా రీమేక్ కో, కొత్త కథకో ఓకె చెప్పాడు. ఈ సినిమా త్వరలోనే సెట్ మీదకు వెళ్తుంది. గురువారం నాడు లాంఛనంగా పూజ చేస్తారు. ఈ సినిమాకు పూజా హెగ్డే, శ్రీలీల ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఆఖరికి కృతి శెట్టి ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?