cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

'మత్తు వదలేలాగే' వుంది

'మత్తు వదలేలాగే' వుంది

సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు సింహా తొలిసారి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మత్తు వదలరా. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు అంతా అనుభవం పండించుకుని, తొలిసారి ఆయా విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు.

కీరవాణి మరో కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే, మైత్రీ మూవీ మేకర్స్ వద్ద సిఇఓ గా వున్నచెర్రీ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు.

ఇలా పలువురి తొలిప్రయత్నం అయిన మత్తువదలరా సినిమా టీజర్ ను విడుదల చేసారు. టీజర్ ను కాస్త డిఫరెంట్ గా వుండేలా కట్ చేసారు. థ్రిల్లర్ టచ్ వున్న సినిమా అనిపించేలా వుంది టీజర్. అయితే కథ వ్యవహారం ఏ మాత్రం అంచనాలకు అందకుండా టీజర్ ను కట్ చేసారు.

సినిమా థ్రిల్లింగ్ గా వుండబోతోందన్న విషయం తెలుస్తోంది తప్ప, అంతకు మించి మరేమీ చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. కాస్త డిఫరెంట్ సినిమాలు కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆశకలిగించేలా మాత్రం వుంది టీజర్.