Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా పోలీస్ కంప్లయింట్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా పోలీస్ కంప్లయింట్

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకుంటున్న కొంతమందిపై సైబరాబాద్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా కంప్లయింట్ చేశారు ఒకప్పటి హీరోయిన్ మీరా చోప్రా. ఎన్టీఆర్ అభిమానులు తనని బెదిరిస్తున్నారని, అసభ్యకరమైన భాషలో తిడుతున్నారని, తన తల్లిదండ్రులకి కరోనా రావాలని శాపాలు పెడుతున్నారని ఆరోపిస్తోంది మీరా.

అసలు విషయం ఏంటంటే.. మీరా చోప్రా ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయింది. వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ లైవ్ లో జవాబులిచ్చింది. అందరు హీరోల గురించి బాగానే పొగిడిన మీరా.. ఎన్టీఆర్ పై మీ అభిప్రాయం ఏంటని అడిగేసరికి మాత్రం "ఐ డోండ్ నో హిమ్.. ఐయామ్ నాట్ హిస్ ఫ్యాన్".. అని తేల్చేసింది. అంతే... అక్కడే గొడవ మొదలైంది.. దీనికి సమాధానంగా ఒకరు శక్తి, దమ్ము సినిమాలు చూడండని బదులిస్తే.. మరికొంతమంది మాత్రం చాలా దారుణంగా రియాక్డ్ అయ్యారు.

ఎన్టీఆర్ ఎవరో తెలియదని చెప్పినందుకు మీరాచోప్రాని బండ బూతులు తిట్టారు. ఆమె తల్లిదండ్రులకి కరోనా రావాలని శాపాలు పెట్టారు. దీంతో మీరా చోప్రా బాగా హర్డ్ అయింది. "మీకు ఇలాంటి అభిమానులున్నారా? మీకంటే మహేష్ బాబు అంటే నాకు ఇష్టం అని చెప్పినందుకు.. నన్నిలా బూతులు తిడుతూ మీ అభిమానులు మెసేజ్ పెట్టారు. ఇదెక్కడి పద్ధతి, ఈ ట్వీట్ ని మీరు గుర్తిస్తారనుకుంటా" అంటూ నేరుగా ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ ని లింక్ చేస్తూ ఓ ట్వీట్ వేసింది మీరా చోప్రా.

విషయం అక్కడితో ఆగలేదు. మీటూ ఉద్యమానికి గట్టి మద్దతిస్తున్న గాయని చిన్మయి కూడా మీరా చోప్రాకి జతకలిసింది. గతంలో ఇలాంటి కొంతమంది దురభిమానులు తనని కూడా బెదిరించారని, ఓ మహిళా జర్నలిస్ట్ ని కూడా అవమానించారని, కేవలం తమ అభిమాన హీరో గురించి గొప్పగా చెప్పనందుకే ఇలా చేస్తారా అని ప్రశ్నించింది చిన్మయి. ఆ తర్వాత మీరా చోప్రా తనని తిడుతూ పోస్టింగ్ లు పెట్టిన ట్విట్టర్ అకౌంట్లన్నిటినీ బ్యాన్ చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులకి ట్విట్టర్ లోనే ఫిర్యాదు చేసింది.

ఈ గొడవ ఇంతటితో ఆగేలా లేదు. మీరా చోప్రా తాడోపేడో తేల్చుకోవాలనుకుంటోంది. అటు ఎన్టీఆర్ సైడ్ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎన్టీఆర్ అభిమానులమంటూ కొంతమంది ఇంకా గొడవ పెంచేందుకే ప్రయత్నించడం మరో విశేషం. ఇప్పటికీ మీరా చోప్రా పేరుతో నెగెటివ్ మెసేజ్ లు పెడుతూ ఓ హ్యాష్ ట్యాగ్ ని పాపులర్ చేస్తున్నారు. వారు నిజంగా ఎన్టీఆర్ అభిమానులైతే.. ఇప్పటికైనా ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టడం మేలు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే మాత్రం ఎన్టీఆర్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుంది. 

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?