“మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. నేటి యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే సినిమా. సరికొత్త కథతో వచ్చిన సినిమా. ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎఁటర్ టైన్ చేసింది. హీరోహీరోయిన్లు అదరగొట్టేశారు.”
విడుదలకు ముందే ఇలా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రివ్యూ వచ్చేసింది. ఈ రివ్యూ ఇచ్చింది కూడా వేరెవరో కాదు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సమీక్ష ఇది. ఈ సినిమాకు తొలి ప్రేక్షకుడు ఆయన.
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకుడు. యూవీ జనాలకు చిరు-చరణ్ తో ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే.
ఆ పరిచయంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను చిరంజీవికి ముందుగా చూపించారు నిర్మాతలు. సినిమా చిరంజీవికి బాగా నచ్చిందంట. జాతిరత్నాలకు రెట్టింపు ఎనర్జీతో నవీన్ పొలిశెట్టి నటిస్తే, గ్యాప్ వచ్చినప్పటికీ అనుష్క చాలా అందంగా ఉందంట.
సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ అని, వినోదానికి ఎమోషన్స్ కూడా అద్భుతంగా మిక్స్ చేశారని చిరంజీవి మెచ్చుకున్నారు. మరో 2 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.