Advertisement

Advertisement


Home > Movies - Movie News

‘మేర్లపాక’ మళ్లీ మరోటి

సరైన ఎంటర్ టైన్ మెంట్ సినిమాను అందించడంలో దర్శకుడు మేర్లపాక గాంధీది ఓ స్పెషల్ స్టయిల్. కానీ సరైన సినిమా పడడం లేదు. అంథాదూన్ రీమేక్ తరువాత తన ఒరిజినల్ స్టయిల్ తో ఓ సినిమాను అందించే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఇది కూడా ఏక్ మినీ కథ మాదిరిగా చిన్న సినిమానే. ఆ సినిమాలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ నే ఈ సినిమాలో కూడా హీరో. జాతిరత్నాలు సినిమాతో యూత్ లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న ఫరా అబ్దుల్లా ఈ సినిమాలో కథానాయిక.

యూ ట్యూబ్ చానెల్ కోసం ట్రావెలాగ్ లు తయారు చేసే హీరో అనుకోకుండా ప్రేమలో, ఆపై ప్రమాదంలో పడిన వైనం ఏదో కథగా మార్చి సినిమా తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు విడుదల చేసిన టీజర్ ఈ వైనమే చెబుతోంది. టోటల్ గా అవుట్ అండ్ అంట్ ఫన్ తో పాటు చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించినట్లు ఆసక్తి కరంగా వున్న టీజర్ చెబుతోంది. ఇంతకీ ఈ సినిమా పేరు ఏమిటంటే…’లైక్..షేర్..అండ్ సబ్ స్రయిబ్’. కాస్త వెరైటీగా వుంది కదా?

ఆముక్త క్రియేషన్స్, నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కమెడియన్ సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?