మంత్ ఆఫ్ మధు… ట్రయాంగిల్ స్టోరీ

మానవ సంబంధాలు, ప్రేమలు, భావోద్వేగాల నేపథ్యంలో కథ అల్లుకోవడం, దానిని నిజాయతీగా తెరకు ఎక్కించడం అంటే అంత సులువు కాదు. కమర్షియల్ టచ్ మిస్ కాకూడదు. సాగదీసినట్లు వుండకూడదు. ఇలా చాలా అంటే లెక్కలు…

మానవ సంబంధాలు, ప్రేమలు, భావోద్వేగాల నేపథ్యంలో కథ అల్లుకోవడం, దానిని నిజాయతీగా తెరకు ఎక్కించడం అంటే అంత సులువు కాదు. కమర్షియల్ టచ్ మిస్ కాకూడదు. సాగదీసినట్లు వుండకూడదు. ఇలా చాలా అంటే లెక్కలు వుంటాయి. అలాంటిది మూడే మూడు కీలకపాత్రలను తీసుకుని ‘మంత్ ఆఫ్ మధు’ అంటూ ఓ సినిమాను తెరకెక్కించారు. మధుమాసం అన్నది మధురోహలకు కేరాఫ్ అడ్రస్. హీరో పేరు మధు సూదన రావు. ఓ కీలక పాత్ర పేరు మధు. వీరిద్దరి నడుమ ఓ నెలలో ఏం జరిగిందన్నది మంత్ ఆఫ్ మధు అనుకోవాలా? ఏమో..

ట్రయిలర్ లో ముందుగా మధు పాత్రనే పరిచయం చేసారు. ఆమెను అమెరికాలో ఇండియన్ అన్నారు. ఇండియాలో ఆమె ఓవర్ ఫ్రీడమ్ ప్రవర్తన చూసి అమెరికన్ అన్నారు.. సమాజం పోకడలు తెలియని ఆమె ప్రవర్తన చూసి వచ్చిన కామెంట్ అది. ఇది ఒక క్యారెక్టర్. ఈ పాత్రను కొత్త నటి శ్రేయ చేసారు.  

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. భర్తను నిజాయతీ గా ప్రేమించే అమ్మాయి. ఈ భర్త ఎందుకు తాగుబోతు అయ్యాడు. అసలు ఆ ఇద్దరు విడాకుల వరకు ఎందుకు వెళ్లారు. ఈ రెండు పాత్రల్లో నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కనిపించారు.

ఈ మూడు పాత్రల నడుమ జరిగిన సంఘనటల సమాహారంగా ట్రయిలర్ కనిపించింది. ములుకుట్ల యశ్వంత్ ఈ సినిమాను నిర్మించారు. శ్రీకాంత్ నాగోతి రచయిత, దర్శకుడు. అతను రాసుకున్న డైలాగులు బాగున్నాయి. అచ్చు రాజుమణి బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. పలుకే బంగారమాయెనా అన్న కీర్తనకు మోడరన్ మ్యూజిక్ టచ్ ఇచ్చి చేసిన ఫ్యూజన్ బాగుంది.