మూడు నెలలు…1500 కోట్లు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వున్న సినిమా అభిమానులు, ముఖ్యంగా తెలుగు సినిమా అభిమానులు రెడీ అయిపోవాల్సిందే. మార్చి, ఏప్రిల్, మే అనే మూడు నెలల్లో తెలుగు సినిమా అభిమానులు అంతా కలిసి టాలీవుడ్ కు…

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వున్న సినిమా అభిమానులు, ముఖ్యంగా తెలుగు సినిమా అభిమానులు రెడీ అయిపోవాల్సిందే. మార్చి, ఏప్రిల్, మే అనే మూడు నెలల్లో తెలుగు సినిమా అభిమానులు అంతా కలిసి టాలీవుడ్ కు సమర్పించాల్సిన మొత్తం 1500 వందల కోట్లు. అక్షరాలా 1500 కోట్లు. ఇది కనీస మొత్తం. ఇది ఇస్తేనే పెద్ద సినిమాలు జ‌స్ట్ బ్రేక్ ఈవెన్ అవుతాయి.

రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట, లాంటి భారీ సినిమాలు, ఇవి కాక ఎఫ్ 3, పక్కా కమర్షియల్, రామారావు ఆన్ డ్యూటీ, గని, అంటే సుందరానికి, ఇంకా ఇంకా పలు సినిమాలు ఈ మూడు నెలల్లో విడుదలవుతున్నాయి. ప్రతి భారీ సినిమా తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనే దాదాపు 100 కోట్ల రేంజ్ లో మార్కెట్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ అయితే 150 కోట్లకు పైనే.

అంటే ఇవన్నీ కలిసి దాదాపు 750 కోట్ల మేరకు తెలుగు రాష్ట్రాల బయ్యర్ల నుంచి సేకరించబోతున్నాయి. నిర్మాతలు, బయ్యర్లు పూర్తిగా సేఫ్ కావాలంటే కనీసంలో కనీసం 1500 కోట్ల రూపాయలు టికెట్ ల రూపంలో ప్రేక్షకులు సమర్పించుకోవాల్సి వుంటుంది. అంటే నెలకు 500 కోట్లు తెలుగు ప్రజ‌లు కేవలం సినిమాల కోసం ఖర్చు చేయాల్సి వుంటుంది.

గత రెండేళ్లలో చూసుకుంటే ఇంత పెద్ద బెట్ ఎప్పుడూ లేదు. కరోనా కారణంగా సినిమాలు అన్నీ వాయిదా పడుతూ ఈ పరిస్థితి వచ్చింది. మరి ఏమవుతుందో చూడాలి.