Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరోసారి మెగా చిచ్చు రాజేసిన బన్నీ

మరోసారి మెగా చిచ్చు రాజేసిన బన్నీ

వివాదాలు అల్లు అర్జున్ కు కొత్త కాదు. మొన్నటికిమొన్న "చెప్పను బ్రదర్" అంటూ పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టాడు.  ఫిలింఛాంబర్ లో పవన్ కల్యాణ్ ను కలిసిన బన్నీ అతడ్ని కౌగిలించుకున్నంత వరకు ఈ వివాదం కొనసాగింది. ఇప్పుడు ఏకంగా మెగాఫ్యాన్స్ తోనే పెట్టుకున్నాడు ఈ మెగాహీరో. అవును.. సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరుకాని బన్నీ, మెగాఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నాడు. కొసమెరుపు ఏంటంటే.. హైదరాబాద్ లో ఉండి కూడా బన్నీ ఈ ఫంక్షన్ కు హాజరుకాలేదు.

మెగా కాంపౌండ్ నుంచి దాదాపు అంతా సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు. చిరంజీవి కుటుంబం మొత్తం వచ్చింది. సాయిధరమ్ తేజ్ కూడా తన తమ్ముడితో కలిసి ఫంక్షన్ కు వచ్చాడు. ఇక పవన్ కల్యాణ్ అయితే ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ లో బన్నీ మాత్రం కనిపించలేదు. అదే మెగాఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. చిరంజీవిని దేవుడిగా, గురువుగా చెప్పుకునే బన్నీ.. సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఎందుకు హాజరుకాలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి కీలకమైన వేడుకలకు పిలవకపోయినా హాజరవ్వాలని, అలాంటిది బన్నీ కావాలనే డుమ్మా కొట్టాడని స్వయంగా కాంపౌండ్ కు దగ్గరి వ్యక్తులే గుసగుసలాడుకుంటున్నారు.

ఇదొక్కడే కాదు.. మొన్నటికిమొన్న సైరా ట్రయిలర్ రిలీజ్ సందర్భంగా కూడా బన్నీపై ఆగ్రహం పెల్లుబికింది. టోటల్ టాలీవుడ్ మొత్తం సైరా ట్రయిలర్ పై స్పందించింది. హీరోలంతా తమతమ పరిథుల్లో ట్రయిలర్ పై రియాక్ట్ అయ్యారు. కానీ బన్నీ మాత్రం అసలు సైరా ట్రయిలర్ ఊసెత్తలేదు. టీజర్ ను షేర్ చేసిన బన్నీ, ట్రయిలర్ కు వచ్చేసరికి మాత్రం సైలెంట్ అయ్యాడు. మరోవైపు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన అల్లు అరవింద్ కూడా తనయుడు ఎందుకు రాలేదనే అంశంపై క్లారిటీ ఇవ్వకపోయేసరికి మెగాభిమానుల్లో కోపం రెట్టింపైంది..

ఓవైపు మెగాభిమానులు బన్నీని ట్రోల్ చేస్తుంటే.. మరోవైపు బన్నీ ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఆ ట్రోలింగ్ ను తిప్పికొడుతున్నారు. బన్నీ ఓ ఈవెంట్ కు హాజరైనా, హాజరవ్వకపోయినా సెన్సేషనే అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు బన్నీ ఫ్యాన్స్, మరో అడుగు ముందుకేసి బన్నీ క్రేజ్ ను మెగా కాంపౌండ్ ఎప్పుడు గుర్తిస్తుందో అంటూ పోస్టులు పెట్టసాగారు. ఇలా కొన్ని గంటలుగా మెగాఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తూనే ఉంది.

ఈ వార్ సంగతి కాసేపు పక్కనపెడితే.. బన్నీ గురించి తెలిసిన వ్యక్తులు మాత్రం అతడు కావాలనే కాంపౌండ్ కు దూరంగా జరుగుతున్నాడనే విషయాన్ని పరోక్షంగా చెబుతున్నారు. అయితే ఏకంగా చిరంజీవికే దూరంగా జరుగుతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. మరి నిజంగానే బన్నీ దూరంగా జరుగుతున్నాడా లేక ఇదంతా ప్రచారమా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?