తెలుగులో క్రేజ్.. హిందీ వైపు చూపు

తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్ కు చేరినప్పటికీ, హిందీ సినిమాలంటే హీరోయిన్లకు అదో రకమైన తుత్తి. వరుసగా తెలుగులో ఆఫర్లు వస్తున్నప్పటికీ బాలీవుడ్ నుంచి చిన్న ఛాన్స్ వస్తే చాలు ఎగిరి గంతేస్తుంటారు.…

తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్ కు చేరినప్పటికీ, హిందీ సినిమాలంటే హీరోయిన్లకు అదో రకమైన తుత్తి. వరుసగా తెలుగులో ఆఫర్లు వస్తున్నప్పటికీ బాలీవుడ్ నుంచి చిన్న ఛాన్స్ వస్తే చాలు ఎగిరి గంతేస్తుంటారు. ఆమధ్య రకుల్ అలానే బాలీవుడ్ కు వెళ్లింది. ఇప్పుడు మృణాల్ చూపులు కూడా అటువైపే.

టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ తో కొనసాగుతోంది మృణాల్. ఆమెకు ఇక్కడ మంచి ఇమేజ్ ఉంది. పెద్ద హీరోల కంట్లో పడింది ఈ బ్యూటీ. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. వాటిని కూడా ఆమె అంగీకరిస్తోంది. తాజాగా కూడా ఓ బాలీవుడ్ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది.

వరుణ్ ధావన్ హీరోగా రాబోతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది మృణాల్. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ ఏడాది మృణాల్ అంగీకరించిన మూడో బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇది.

చూస్తుంటే, ఆమెకు తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలంటేనే ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుంది. రీసెంట్ గా తెలుగులో కల్కి సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది మృణాల్. అంతకంటే ముందు విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది.

8 Replies to “తెలుగులో క్రేజ్.. హిందీ వైపు చూపు”

  1. మృణాల్ ఠాకూర్ కు టాలెంట్ ఉంది. తెలుగు దర్శక నిర్మాతలు హీరోయిన్లను రాత్రి వేళ లలో సకుటుంబ సపరివార సమేతంగా వాడేసుకుంటారు. హీరో కు ఇచ్చే విలువ గాని పారితోషికం గాని ఇవ్వరు. అదే బాలీవుడ్ లో అయితే ‘శీలం చెడ్డా ఫలితం’ మాత్రం అద్భుతః అంటారు.

  2. ఆమె మొదట హిందీ సినిమాల లోనే నటించినట్లుంది, ఈమధ్య ఏదో సినిమా కూడా చూసాను ఆమె నటించిన హిందీ సినిమా

Comments are closed.