టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ శృంగారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లస్ట్ స్టోరీస్-2 సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియాతో మాట్లాడుతూ లస్ట్, సెక్స్‌పైన తన అభిప్రాయాన్ని, వాటి పట్ల యువతలో ఉండాల్సిన అవగాహన గురించి మృణాల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. యువత ఎదుగుతున్న సమయంలో వారికి లస్ట్, సెక్స్ సంభాషణల పట్ల అవగాహన కీలకమని తాను నమ్ముతున్నట్లు.. కుటుంబంలోని పిల్లలు, యువకులతో సహా కనీసం ఒక్కసారైనా ఈ అంశం గురించి నిజాయితీగా చర్చంచుకోగలిగితే వారికి వాటి పట్ల బయట నుండి తప్పుడు సమాచారం రాదని అభిప్రాయపడింది.
కాగా మృణాల్ ఈ సిరీస్‌లో త్వరలో పెండ్లి కాబోయే అమ్మాయి పాత్రలో నటించింది. ఈ సిరీస్‌లో తన నటనకు గాను మంచి ప్రశంసలు అందుకుంటోంది. మృణాల్ సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులోనే కాక దేశమంతా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత తన బోల్డ్ ఫోటోషూట్స్ తో మరింత పాపులర్ అయి ఫాలోయింగ్ పెంచుకుంది. ప్రస్తుతం మృణాల్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.