నెటిజ‌న్ల ట్రోలింగ్‌కు ముద్దుగుమ్మ బేంబేలు

ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తే ఎవ‌రైనా ఇబ్బందులు ప‌డాల్సిందే. “నా అంద‌చందాలు, నా ఇష్టం” అని ఎవ‌రైనా భావించి ఇష్టానుసారం ప్ర‌వ‌ర్తిస్తే మాత్రం ఛీత్కారాలు త‌ప్ప‌వు. అస‌లే సోష‌ల్ మీడియా కాలం. ప్ర‌తిదీ ప‌రిశీల‌న‌లో ఉంటోంది. …

ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తే ఎవ‌రైనా ఇబ్బందులు ప‌డాల్సిందే. “నా అంద‌చందాలు, నా ఇష్టం” అని ఎవ‌రైనా భావించి ఇష్టానుసారం ప్ర‌వ‌ర్తిస్తే మాత్రం ఛీత్కారాలు త‌ప్ప‌వు. అస‌లే సోష‌ల్ మీడియా కాలం. ప్ర‌తిదీ ప‌రిశీల‌న‌లో ఉంటోంది. 

ఇక సెల‌బ్రిటీలైతే మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ముద్దుల కూతురు  ఆలియా క‌శ్య‌ప్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఎదురైంది.

ఇటీవ‌ల ఆలియా సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. లైంగికంగా రెచ్చ‌గొట్టేలా ఉన్న వీడియోను అభిమానుల‌తో పంచుకున్నారామె. ఈ వీడియోపై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. 

ఎక్కువ మంది ఆలియా మోతాదుకు మించి అందాల ప్ర‌ద‌ర్శ‌న‌పై వ్య‌తిరేక‌త ప్ర‌ద‌ర్శిస్తూ …. ఘాటు కామెంట్స్ పెట్టారు. నెటిజ‌న్ల ధాటికి ముద్దుగుమ్మ‌ ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

సోషల్ మీడియాలో భారీగా ఫాలోయ‌ర్స్‌ను క‌లిగిన ఆలియా సరదా కోసం వీడియో పెట్టాన‌ని చెప్పుకుంటున్నా… నెటిజ‌న్లు మాత్రం ప‌ట్టించుకోలేదు. ఆలియా ఆవేద‌న చూస్తే… నెటిజ‌న్ల కామెంట్స్  ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. 

“నేను వ్యభిచారినని, నాపై అత్యాచారం చేస్తామని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టారు. అవి చదివి చాలా బాధ పడ్డాను..” అని ఆలియా వాపోయింది. అందుకే చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోవ‌డం కంటే, కాస్త జాగ్ర‌త్త‌గా ఉంటే ఈ తిప్ప‌లు ఉండ‌వ‌ని పెద్ద‌లు చెప్ప‌డం. 

కుప్పంలో టీడీపీ 14 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది

ఈ ఏడాది ఎలాగైనా 3 సినిమాలు రిలీజ్ చేయాలని టార్గెట్