ఎన్టీఆర్-రామ్ చరణ్ మాంచి మిత్రులు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఆ సంగతి కూడా తెలిసిందే. అంతే కాదు, ఆ ఇధ్దరూ కలిసి మరో ఇద్దరు డైరక్టర్లను కూడా తమ కోసం రిజర్వ్ చేసేసుకున్నారు. దీంతో మూడు టాప్ సినిమాలు ఇద్దరికీ లైనప్ గా వచ్చేసాయి.
విషయం ఏమిటంటే, రాజమౌళితో సినిమా చేస్తూ, త్రివిక్రమ్ సినిమాను పిక్స్ చేసుకున్నాడు తారక్. అదే టైమ్ లో కొరటాల శివ సినిమాను ఫిక్స్ ఛేసుకున్నాడు చరణ్. త్రివిక్రమ్ సినిమా తారక్ తో కాగానే చరణ్ తో వుండేలా ప్లాన్ చేసారు. అదే విధంగా కొరటాల శివ సినిమా చరణ్ తో కాగానే తారక్ తో వుండేలా సెట్ చేసారు.
ఆ విధంగా టాప్ ఫైవ్ డైరక్టర్లలో ముగ్గురు డైరక్టర్లు ఆ ఇద్దరితోనే సినిమాలు చేస్తారు వరుసగా అన్నమాట. వీరుగాక ఇంకా ప్రశాంత్ నీల్, అట్లీ లాంటి వాళ్లు లైన్ లో వుండనే వున్నారు ఎన్టీఆర్ కోసం. బాగుంటే వీళ్లను అటు చరణ్ కు కూడా డైరెక్ట్ చేస్తాడేమో తారక్. మొత్తానికి మిత్రుల ప్లానింగ్ బాగుంది.