టాలీవుడ్ లో చకచకా సినిమాలు నిర్మించే సంస్థ మైత్రీ. భారీ సినిమాల నిర్మాణంతో పాటు ఆంధ్రలో విస్తారంగా డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ కలిగి వున్న సంస్త యువి. ఇప్పుడు ఈ రెండు సంస్థలు చేతులు కలుపుతున్నాయి.
కలిసి సినిమాలు చేసే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల చకచకా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఇదే పని మీద మైత్రీ..యువి అధినేతలు ముంబాయి కూడా వెళ్లి వచ్చారు.
యువి దగ్గర రామ్ చరణ్ డేట్ లు వున్నాయి. అందువల్ల మైత్రీ ఈ ప్రాజెక్ట్ కు కావాల్సిన డైరక్టర్ ను సమకూర్చి, నిర్మాణ బాధ్యతలు తీసుకునే ఆలోచన చేస్తోంది. అదే విధంగా ప్రభాస్ దగ్గర మైత్రీ కి అడ్వాన్స్ వుంది. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్ధ ఆనంద్ డైరక్షన్ లో సినిమా చేసే ఆలోచన వుంది. ఈ సినిమాలో యువి కూడా భాగస్వామిగా వుంటుంది.
ఇలా రెండు సంస్థలు పలు ప్లాన్ లు చేస్తున్నాయని బోగట్టా. ఒక విధంగా మంచి పరిణామమే. మైత్రీ నిర్మాణం, యువి పంపిణీ, థియేటర్ నెట్ వర్క్ కలిస్తే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం వుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదొ ట్రెండ్ అనుకోవాలి. పెద్ద పెద్ద సంస్థలు కలిసి సినిమాలు చేయడం.