రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకుడిగా మారడానికి ఎంచుకున్న సినిమా నిన్న మొన్నటి వరకు అనుమానంలో పడింది. ఎందుకంటే బెజవాడ రీమేక్ కోసం ఎంచుకున్న మలయాళ సినిమా హక్కులు అభిషేక్ అగర్వాల్ దగ్గర వుండడమే.
నిజానికి హక్కులు కొనిపించింది బెజవాడే అయినా, ఇవ్వడానికి అభిషేక్ సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో విపరీతంగా మల్ల గుల్లాలు పడ్డారు. రకరకాల బేరాలు నడిచాయి. చాలా మంది తలా మాట చెప్పి చూసారు. ఇక చివరకు వేరే కథతో ముందుకు వెళ్లిపోదాం అనుకున్నారు నాగ్-బెజవాడ.
ఆఖరికి ఇప్పుడు సెటిల్ అయింది. హక్కులను నిర్మాత చిట్టూరి శ్రీనుకు బదలాయించడానికి అభిషేక్ అగర్వాల్ సుమఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాతకోతలు పూర్తి కావాల్సి వుంది. ఇదిలా వుంటే సినిమాకు ఉగాది మర్నాడు ముహుర్తం చేసే ఆలోచన కూడా వుంది. నిర్మాత చిట్టూరి శ్రీను-హీరో నాగార్ఙున కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఈ రోజు రేపట్లో అది డిసైడ్ అవుతుంది.
నాగ్ సినిమా పట్టాల మీదకు వచ్చి కాస్త ఎక్కువ రోజులే అయింది. ఇప్పుడు ఈ సినిమా బహుశా ఏప్రిల్ నుంచి షూటింగ్ కు వెళ్లే అవకాశం వుంది.