cloudfront

Advertisement


Home > Movies - Movie News

నభా ఆనందమే ఆనందం

నభా ఆనందమే ఆనందం

తొలిసినిమా 'నన్ను దోచుకుందువటే' పెద్దగా పేరు తీసుకురాకపోయినా, మరో సినిమా చాన్స్ అయితే తీసుకువచ్చింది హీరోయిన్ నభానటేష్ కు. అదే పూరి జగన్నాధ్-రామ్ ల ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా నభా నటేష్ కెరీర్ కు ఎంత ఉపయోగపడుతుందో ఏమో కానీ, సినిమా విజయంలో ఆమె పాత్ర అయితే వుంది. 

రెండో సినిమాతోనే ఇలాంటి క్రెడిట్ దక్కడంతో నభా ఆనందంతో ఫుల్ జోష్ మీద వుంది. ఇస్మార్ట్ శంకర్ లో నభా చేసిన క్రేజీ గర్ల్ పాత్రల్లాంటివి తెలుగు సినిమాల్లో వుంటూనే వుంటాయి. పూరి సినిమా కాబట్టి కాస్త బోల్డ్ గా వుంది. అందువల్ల ఇక ఇలాంటి పాత్రలు అయినా, కాస్త గ్లామర్ ఒలకబోయాలన్నా తనను గుర్తు చేసుకుంటారని భావిస్తోంది నభా నటేష్.

పిఆర్ విషయంలో నభా కాస్త చలాకీగానే వుంటుంది. వారానికో ఫోటో షూట్ చేసి మీడియాకు వదుల్తూ వుంటుంది. ఆ ఫొటో షూట్ లు కూడా ఇస్మార్ట్ శంకర్ లో సీన్లకు సమానంగానే వుంటాయి. అందువల్ల ఇస్మార్ట్ శంకర్ లో ఒలకబోసిన అందాల పుణ్యమా అని మరికొన్ని అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయని భావిస్తోంది నభా నటేష్.

పూరి ఇంటర్వ్యూలో చెప్పినట్లే సినిమా ఉందా?

అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా