Advertisement

Advertisement


Home > Movies - Movie News

నిఖిల్ సరసన నభా

నిఖిల్ సరసన నభా

ఇస్మార్ట్ శంకర్‌తో సర్రున దూసుకువచ్చేసింది హీరోయిన్ నభా నటేష్. కానీ ఆ తరువాత అవకాశాలు వచ్చాయి కానీ సక్సెస్ మాత్రం అంతగా రాలేదు. దాంతో మెల్లగా వెనుకబడింది. ఇప్పుడిప్పుడే మళ్లీ చాన్స్ లు అందుకుంటోంది.

హీరోయిన్ కీలక పాత్రతో, ప్రియదర్శి జోడీగా హనుమాన్ నిర్మాత నిర్మించే ఓ సినిమా చేస్తోంది నభా. ఇప్పుడు మరో మంచి చాన్స్ వచ్చింది. హీరో నిఖిల్ తో నిర్మాత టాగోర్ మధు నిర్మించే స్వయంభు సినిమాకు కూడా నభాను తీసుకున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. మరి రెండో హీరోయిన్ గానో,లేదా కీలకపాత్రకో మొత్తం మీద, నభా నటేష్ ను తీసుకుంటున్నారని తెలుస్తోంది. నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ సినిమా ఇది. చాలా వరకు సిజి వర్క్, భారీ సెట్ లు అవసరమైన సినిమా. ఈ సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది.

నభా ఫిజిక్ కు వచ్చిన సమస్య ఏమీ లేదు కానీ, ఇటీవల మరింత శ్రద్ద తీసుకుని, తన అందాలను మెరుగుపరుచుకున్నట్లు తెలుస్తోంది. మరో సినిమాలో కూడా హీరోయిన్ పాత్రకు నభా ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?