Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇస్మార్ట్ హీరోయిన్ కు మరో ఛాన్స్

ఇస్మార్ట్ హీరోయిన్ కు మరో ఛాన్స్

నభా నటేష్.. అందం, యాక్టింగ్ టాలెంట్ రెండూ ఉన్నాయి. కానీ ఆమెకు అదృష్టం లేదు. యాక్సిడెంట్ తర్వాత ఆమెకు అవకాశాలు దాదాపు తగ్గిపోయాయి. రకరకాల ఫొటోషూట్స్ రిలీజ్ చేసినా ఫలితం లేకపోయింది. మొత్తానికి ఎలాగోలా ఓ సినిమా ఆఫర్ దక్కించుకుంది.

ప్రియదర్శి సరసన ఓ సినిమా చేస్తోంది. ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్ గా జరుగుతోంది ఆ షూట్. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో అవకాశం చేజిక్కించుకుంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

స్వయంభూలో ఆల్రెడీ ఓ హీరోయిన్ ఉంది. ముందుగా సంయుక్త మీనన్ ను తీసుకున్నారు. ఇప్పుడు నభా నటేష్ ను తీసుకున్నారు. సంయుక్త మీనన్ లుక్ ను బయటపెట్టకముందే, స్వయంభూ సినిమా నుంచి నభా నటేష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం విశేషం.

చీరకట్టులో ఒంటినిండా నగలతో యువరాణిలా మెరిసిపోతోంది నభా నటేష్. ఆమె ఆల్రెడీ సెట్స్ లో ఉంది. నిఖిల్ తో కలిసి షూటింగ్ లో పాల్గొంటోంది. ఫస్ట్ లుక్ లో భాగంగా విడుదల చేసిన వీడియోలో ఇవన్నీ చూపించారు.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై నిఖిల్ ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, ఇప్పుడు నభా నటేష్ కూడా అంతే హోప్స్ పెట్టుకుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?