టైటిల్ పెట్టారు కానీ చెప్పడం లేదంతే!

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ అయిందనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర గతంలోనే వెల్లడించింది. ఈ మేరకు ఫిలింఛాంబర్ లో కూడా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్…

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ అయిందనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర గతంలోనే వెల్లడించింది. ఈ మేరకు ఫిలింఛాంబర్ లో కూడా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై (నారాయణ్ దాస్ నారంగ్ నిర్మాత) లవ్ స్టోరీ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. కానీ ఎందుకో అదే టైటిల్ అని చెప్పడానికి యూనిట్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

రీసెంట్ గా టైటిల్ పై నాగచైతన్య కూడా రియాక్ట్ అయ్యాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ పరిశీలిస్తున్నామని, కానీ ఫైనల్ చేయలేదని అంటున్నాడు. కేవలం అది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, పండక్కి ఒరిజినల్ టైటిల్ తో లోగోను రిలీజ్ చేస్తామంటున్నాడు. అటు కమ్ముల మాత్రం తమ సినిమా పేరు లవ్ స్టోరీ అని ఫిక్స్ చేశారు.

ఇక సినిమా షూటింగ్ అప్ డేట్స్ పై కూడా నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు. అంతా అనుకుంటున్నట్టు లవ్ స్టోరీ షూటింగ్ 80శాతం పూర్తవ్వలేదట. కేవలం 40శాతం మాత్రమే షూటింగ్ అయిందని ప్రకటించాడు. ఇంకా షూటింగ్ నడుస్తోందని, శేఖర్ కమ్ముల చాలా టేక్స్ చెబుతున్నాడని, కానీ ఆ ప్రాసెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని ప్రకటించాడు చైతూ.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త హీరోహీరోయిన్లతో షూటింగ్ స్టార్ట్ చేశాడు కమ్ముల. కానీ ఔట్ పుట్ సరిగా రాలేదు. దీంతో పూర్తిగా వాళ్లను తప్పించి, వాళ్ల స్థానంలో నాగచైతన్య, సాయిపల్లవిని తీసుకున్నాడు. కేవలం వీళ్లతో షూట్ చేస్తే సరిపోతుందని, ప్యాడింగ్ అంతా సిద్ధంగా ఉందని భావించాడు. కానీ ఇప్పుడు మిగతా నటీనటులతో కూడా ఫ్రెష్ గా సన్నివేశాలు తెరకెక్కించే పని ప్రారంభించాడు.

అంటే, ఇంతకుముందు తీసిన సినిమా మొత్తాన్ని పూర్తిగా పక్కనపెట్టాడన్నమాట. అందుకే సినిమా షూటింగ్ కేవలం 40శాతం మాత్రమే పూర్తయిందని ప్రకటించాడు నాగచైతన్య. వచ్చే ఏడాది సమ్మర్ లో (ఏప్రిల్ 2) ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.