ఈమధ్యే సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది..
డిసెంబర్ లో రిలీజ్ అని ప్రకటించాడు కమ్ముల..
శేఖర్ కమ్ముల సినిమాలేవీ నెలల వ్యవథిలో షూట్ పూర్తిచేసుకొని రిలీజ్ అయిన దాఖలాలు లేవు. అలాంటిది నాగచైతన్య, సాయిపల్లవిని హీరోహీరోయిన్లుగా పెట్టుకొని స్టార్ట్ చేసిన కొత్త సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని గ్రాండ్ గా ప్రకటించాడు. కానీ ఇప్పుడా సినిమా వాయిదా పడింది. మరో 2 నెలల్లో ఈ సినిమాను సిద్ధం చేయడం కష్టమని భావించిన కమ్ముల, వచ్చే ఏడాదికి సినిమాను పోస్ట్ పోన్ చేశాడు.
నిజానికి ఇది ఫ్రెష్ గా స్టార్ట్ చేసిన సినిమా కాదు. ఇంతకుముందే ఈ సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చాడు కమ్ముల. ఎప్పట్లానే కొత్త హీరోహీరోయిన్లతో ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు. కాకపోతే వాళ్ల నుంచి ఎక్స్ ప్రెషన్స్ రాబట్టడం కమ్ముల వల్ల కాలేదు. పైగా ఇది డాన్స్, మ్యూజిక్ బేస్డ్ సినిమా. తెలంగాణ యాస డైలాగ్స్ కూడా ఉన్నాయి. అందుకే కొత్త వాళ్లతో తీయలేకపోయాడు కమ్ముల. దీంతో దాదాపు 6 నెలల పాటు వెయిట్ చేసి, చివరికి ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేశాడు. ఇప్పుడు అదే కథతో చైతూ-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా సినిమా స్టార్ట్ చేశాడు.
క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించిన సీన్లు అన్నీ ఇప్పటికే షూట్ చేయడంతో.. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాల్ని షూట్ చేస్తే సరిపోతుందని కమ్ముల భావించాడు. అందుకే డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. కానీ జనాలకు మాత్రం ఈ సినిమాపై అనుమానాలు అలానే ఉన్నాయి. డిసెంబర్ లో విడుదల ఉండకపోవచ్చని అంతా అనుమానించారు. ఆ అనుమానాల్ని నిజం చేస్తూ తన సినిమాను వాయిదావేశాడు దర్శకుడు.
డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. అప్పటికీ కొంత ప్యాచ్ వర్క్ మిగిలే ఉంటుందని అంటున్నారు. జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయాలనేది తాజా ప్లాన్. ఈ సినిమాతో ఏషియన్ సినిమాస్ డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలుగా మారుతున్నారు.