నాగబాబు – ‘అమ్మ మొగుడు’

ఒక అమ్మ మొగుడికి పుట్టినోళ్లంతా ఒకేలా ఉండరనే దానికి బెస్ట్ ఉదాహరణ చిరంజీవి, నాగబాబు, పవన్. చిరంజీవి తన డీసెన్సీని కాపాడుకుంటూ జీవిస్తుంటారు. తన తమ్ముళ్లు మాత్రం బీపీ పేషెంట్లలాగ అయినదానికి కానిదానికి భౌభౌమంటుంటారు.…

ఒక అమ్మ మొగుడికి పుట్టినోళ్లంతా ఒకేలా ఉండరనే దానికి బెస్ట్ ఉదాహరణ చిరంజీవి, నాగబాబు, పవన్. చిరంజీవి తన డీసెన్సీని కాపాడుకుంటూ జీవిస్తుంటారు. తన తమ్ముళ్లు మాత్రం బీపీ పేషెంట్లలాగ అయినదానికి కానిదానికి భౌభౌమంటుంటారు. వీళ్లల్లో ఇప్పుడు టాపిక్ నాగబాబు. 

తమ్మారెడ్డి భరద్వాజ ఆర్.ఆర్.ఆర్ గురించి తన అభిప్రాయం ఏదో చెబితే దానికి నాగబాబు స్పందించిన తీరు అసహ్యకరంగా ఉంది. 75 ఏళ్ల తమ్మారెడ్డిని పట్టుకుని “ఆర్.ఆర్.ఆర్ అవార్డు కొనడానికి నీ అమ్మ మొగుడు కట్టాడారా 80 కోట్లు” అంటూ ట్వీట్ పెట్టాడు. “నీ అమ్మ మొగుడు” అనడం “రా” అని సంబోధించడం రెండూ బలుపెక్కి అన్నమాటలే. ఆ బలుపుకి సమాధానంగానే ఈ వ్యాసం అదే పదంతో మొదలుపెట్టాల్సొచ్చింది తప్ప సంస్కారం తప్పి కాదు. 

అసలీ నాగబాబు చరిత్రని తవ్వితే చాలా అసహ్యాలు బయటపడతాయి. ఇతనేదో ఆర్జీవిని, యండమూరిని నోటిదూలగాళ్లని తిడతాడు గానీ నిజానికి ఇతనికున్నంత నోటిదూల, వేళ్ళదూల (ట్వీట్లు పెట్టేటప్పుడు) ఎవ్వడికీ ఉండదు. ఈ దూలల సంగతి పక్కనపెడితే చిరంజీవి తమ్ముడిగా ఈ నాగబాబు చేసిన పనులు కొన్ని చెప్పుకోవాలి. 

ప్రతి ఊరికి ఒక చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటుండేవాడు. అలా ఒక ఊరిలో ఒకతను ఉండేవాడు. ఏ సమస్య వచ్చినా మాటలతో డీసెంట్ గా సెటిల్ చేసే వ్యక్తిత్వం ఉన్నవాడు. ఒకసారి వేరే హీరో ఫ్యాన్స్ వచ్చి చిరంజీవి కొత్త సినిమా ఫ్లెక్సీని చింపారు. దాంతో పెద్ద గొడవయ్యింది. చిరంజీవి ఫ్యాన్స్ రెచ్చిపోబోతే ఈ ప్రెసిడెంట్ ఆపి గొడవలొద్దని చెప్పి నచ్చజెప్పాడు. అవతల హీరోల ఫ్యాన్స్ చేత సారీ చెప్పించి గొడవని సుఖాంతం చేసాడు. 

ఈ విషయం తెలిసి ఆ ప్రెసిడెంట్ ని పిలిచి నాగబాబు నానా చివాట్లు పెట్టాడని చెప్పుకున్నారు. 

ఇలా సామరస్యంగా గొడవల్ని సెటిల్ చేసే వాడు మాకెందుకు… చిరంజీవి ఫ్యాన్స్ అంటే రౌడీల్లాగ ఉండాలి… వాళ్ల ప్రెసిడెంటంటే పెద్ద రౌడీలాగుండాలి… అవతల హీరో ఫ్యాన్స్ చిరంజీవి గారి పొస్టర్ చింపితే వాళ్ల హీరో సినిమా ఆడుతున్న థియేటర్ని మనం తగలబెట్టేయాలి..అని తిట్టి ఆ ప్రెసిడెంటుని పీకేసాడట. 

అదీ నాగబాబు నైజం అని చెప్పుకునేవారు. చిరంజీవి ఇమేజంతా రౌడీయిజం చెయగలిగే ఫ్యాన్స్ లోనే ఉంటుందని నమ్మే దగుల్బాజీ రకమన్నమాట. 

నిజానికి చిరంజీవి తన ఫ్యాన్స్ కి రక్తదానం చెయ్యాలని, నేత్రదానం చెయ్యాలని చెబుతుంటారు. ఫ్యాన్స్ చేస్తుంటారు కూడా. కానీ ఈ నాగబాబువల్ల వాళ్లే రెచ్చిపోయి రౌడీయిజాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పైనున్నవాళ్లు ఎలా చెప్తే అలా చేసేసే బోళామనుషులు ఫ్యాన్స్. వాళ్లని మంచికి వాడొచ్చు, చెడు చేయడానికి ఉసి గొల్పొచ్చు. నాగబాబుకి రెండోదే ఇష్టం. 

చిరంజీవి ఫ్యాన్స్ అప్పట్లో ఒక హీరో కారు మీద దాడి చేసారు. దానికి మూలకారకుడు కూడా నాగబాబే అని అప్పట్లో అనుకున్నారు. అలాగే దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఒక సీనియర్ సినిమా క్రిటిక్ మీద కూడా చిరంజీవి ఫ్యాన్స్ దాడి చేయబోయారు. దానిని వెనుకుండి నడిపించింది కూడా నాగబాబే అని అప్పట్లో టాక్. ఇలా చిరంజీవి ఫ్యాన్స్ ఏ రౌడీపని చేసినా అవన్నీ నాగబాబు అకౌంట్లే అని చెప్పుకునేంత పేరు మూటగట్టుకున్నాడు. 

తమజోలికి వస్తే ఊరుకునేది లేదంటూ ఏదో పెద్ద చిరంజీవి అంగరక్షకుడిలా ఫీలౌతుంటాడు. నిజానికి ఇతని వల్ల చిరంజీవికి ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ. 

ఇప్పుడు జనసేన ఆవిర్భావదినోత్సవాలకి అంటూ ఆస్ట్రేలియా ప్రయాణమయ్యాడు. దేనికి? అక్కడ జనాలనుంచి డబ్బులు అడుక్కోవడానికి. లేకపోతే ఆస్ట్రేలియాకి, జనసేనకి సంబంధమేంటి? అన్నయ్య ప్రాపకంలో బతకడం, తమ్ముడికి కాళ్ళొత్తడం, విదేశాలకెళ్ళి అడుక్కోవడం తప్ప ఇతను చేసే ఘనకార్యాలేవీ ఉండవు. వయసొచ్చాక సంస్కారం పెరగాలి. అది పెరక్కపోవడం దౌర్భాగ్యం. 

ఈ సందర్భంగా తమ్మారెడ్డి మీద ఆవేశపడిన కె. రాఘవేంద్ర రావు గారికి కూడా ఒక చిన్న వివరణ. ఆస్కార్ అవార్డు ప్రయత్నానికి రూ 80 కోట్లు అయ్యిందా లేదా అనే అకౌంట్ విషయాలు అందరికంటే ఆయన మేనల్లుడు శోభు యార్లగడ్డకే తెలుసు. ఇక్కడ ఎవరూ కూడా రూ 80 కోట్లు పెట్టి ఆస్కార్ అవార్డు కొనుక్కున్నారని చెప్పలేదు. ఆ అవార్డు అలా కొనగలిగేది కాదని తెలుసు. అయితే అమెరికన్ మీడియాలో ప్రచారం చేయకుండా, అక్కడి ఇంఫ్లుయెన్సర్స్ దృష్టిని ఆకర్షించకుండా ఆ అవార్డు కష్టమన్నది జగమెరిగిన సత్యం. దానికి కచ్చితంగా ఖర్చవుతుంది. అమెరికన్ మీడియాలో ఏదీ ఫ్రీగా రాదు. డబ్బిచ్చి ప్రచారం చేయించుకున్నామని ఒప్పుకోవడం తప్పు కూడా కాదు. అక్కర్లేని హిపొక్రసీలు, మేకపోతు గాంభీర్యాలు అనవసరం.

ఆర్.ఆర్.ఆర్ మనకి గొప్ప కావచ్చేమో. అమెరికాలో అదేంటో ఎవ్వడికీ తెలియదు మనవాళ్లు అక్కడి మీడియాలో ఊదరగొట్టేవరకు. ఈ సత్యాన్ని మరిచిపోతే ఎలా? అవార్డొస్తే తెలుగువాళ్లందరం ఆనందిద్దాం. కానీ వాస్తవాలు కూడా మాట్లాడుకుందాం. తప్పేముంది! 

“ఆర్ ఆర్ ఆర్” రాజమౌళి సినిమాల్లోకేల్లా వీకెస్ట్ సినిమా. దానికే కేమరూన్లు, స్పీల్ బెర్గులూ ఊగిపోతే ఇక బాహుబలి లాంటి ఎవెర్ గ్రీన్ క్లాసిక్ రుచి చూపిస్తే ఏమైపోయేవారో. తాను తీసిన సినిమాల్లోకెల్లా లాస్ట్ ర్యాంక్ పొందిన సినిమాతోనే తెలుగు సినిమాని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మనమంతా గర్వపడాల్సిందే. 

మధ్యలో ఈ జబర్దస్త్ జోకర్ నాగబాబు చేష్టల్ని లైటుగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. 

రాజేష్. ఆర్వీ

(ఈ వ్యాసానికి, గ్రేటాంధ్రా సంపాదకవర్గానికి సంబంధం లేదు. ఇది సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న వ్యాసం)