Advertisement

Advertisement


Home > Movies - Movie News

పొలిటికల్‌ లీడర్‌గా మాత్రమే నటిస్తా- నాగార్జున‌

పొలిటికల్‌ లీడర్‌గా మాత్రమే నటిస్తా- నాగార్జున‌

గ‌త కొంత కాలంగా త‌న‌పై వ‌స్తున్నా పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చారు సినీ హీరో అక్కినేని నాగార్జున‌. విజ‌య‌వాడ ఎంపీ స్ధానం నుండి వైసీపీ త‌రుపున పోటీ చేస్తార‌న్న వార్త‌ల‌పై ఆయ‌న‌ స్పందించారు. ఎంపీగా పోటీ చేస్తాన‌న్న వార్తలు అవాస్త‌మ‌ని, గ‌త 15 ఏళ్లుగా ఇలాంటి ప్ర‌చారాలు జ‌రుగుతూనే ఉన్న‌యని, ఇలాంటివి ప‌ట్టించుకోన‌ని నాగార్జున సృష్టం చేశారు. 

నాగార్జున‌ కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం 'ది ఘోస్ట్‌'  ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ లో త‌న రాజ‌కీయ పుకార్ల‌పై క్లారిటి ఇచ్చారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని, ఎలాంటి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని సృష్టం చేశారు. మంచి క‌థ వ‌స్తే పొలిటిక‌ల్ లీడ‌ర్ గా మ‌త్రమే న‌టిస్తాన‌న్నారు.

సినీ హీరో నాగార్జున‌ సీఎం జగన్‌తో చాలా సన్నిహితంగా ఉంటారు. ఆ మ‌ధ్య‌లో కూడా టాలీవుడ్ సినిమా టికెట్ల విష‌యంలో నెలకొన్న స‌మ‌స్యల‌ను సీఎం జ‌గ‌న్ ను క‌లిసి పరిస్ధితులు చక్కదిద్దారు. మొత్తానికి త‌న‌పై వస్తున్న రాజ‌కీయ‌ పుకార్ల‌కు త‌నే స్వస్తి ప‌లికారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?