Advertisement

Advertisement


Home > Movies - Movie News

నిహారికకు వచ్చే ఏడాది పెళ్లి.. వరణ్ తేజ్ కు కూడా

నిహారికకు వచ్చే ఏడాది పెళ్లి.. వరణ్ తేజ్ కు కూడా

తన పిల్లల పెళ్లిళ్లపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. కెరీర్ పరంగా వాళ్లకు తను ఎలాంటి అడ్డంకులు సృష్టించబోనని.. కానీ వాళ్ల పెళ్లి చేయాల్సిన బాధ్యత మాత్రం తనపై ఉందన్నారు. ప్రస్తుతం అదే ఆలోచనలో ఉన్నానని, నిహారికకు వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేస్తానని చెబుతున్నారు నాగబాబు.

"నిహారికకు సంబంధాలు చూస్తున్నాం. వచ్చే ఏడాది ఏప్రిల్-మే లోపు పెళ్లి అయిపోతుంది. నిహారిక పెళ్లయిన తర్వాత వరుణ్ కు కూడా పెళ్లి చేయాలి. బహుశా.. వచ్చే ఏడాది చివరి నాటికి వరుణ్ కు పెళ్లయిపోతుంది. అలా కుదరకపోతే 2022లోనైనా వరుణ్ కు పెళ్లి చేయడం గ్యారెంటీ."

ఇలా తన పిల్లల పెళ్లిపై రియాక్ట్ అయ్యారు నాగబాబు. వాళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయిపోతే తను వంద శాతం ఫ్రీ అయిపోతానన్నారు.. ప్రతి రోజూ వాళ్లు ఎక్కడ్నుంచి వస్తున్నారో, లేటుగా ఎందుకొస్తున్నారో అనే టెన్షన్ తనకు ఉండదని.. పెళ్లిళ్లు చేసేస్తే నిహారిక భర్త, వరుణ్ భార్య ఇకపై అవి చూసుకుంటారని అంటున్నారు నాగబాబు.

ప్రతి తండ్రికి తమ పిల్లల్ని ఏదో చేయాలని ఉంటుంది. నాగబాబుకు కూడా వరుణ్ తేజ్, నిహారిక విషయంలో అలాంటి కోరిక ఉంది. వరుణ్ ను ఆయన ఐపీఎస్ ను చేద్దాం అనుకున్నారట. ఇక నిహారికను డాక్టర్ చదివిద్దాం అనుకున్నారట. కానీ డ్రాప్ అయ్యారు. ఎందుకో ఆయన మాటల్లోనే...

"వరుణ్ బాబును ఐపీఎస్ చేద్దాం అనుకున్నాను. పాప నిహారికను డాక్టర్ ను చేద్దాం అనుకున్నాను. ఇది నా కోరిక మాత్రమే. వాళ్లపై ఎప్పుడూ రుద్దలేదు. వరుణ్ అయితే ఇంటర్మీడియట్ నుంచే నా మాట వినడం మానేశాడు. నిహారికను మాత్రం డాక్టర్ ను చేద్దామని బాగా ఇన్ స్పైర్ చేశాను. కానీ  ఒకరోజు ఎందుకో నాకే అనిపించింది. డాక్టర్ అవ్వాలంటే సింపుల్ గా ఎంబీబీఎస్ చదివితే సరిపోదు. స్పెషాలిటీ-సూపర్ స్పెషాలిటీ చేయాలి. ఈ స్టేజ్ వరకు రావాలంటే 32 ఏళ్లు పట్టేస్తుంది. ఎందుకో నిహారిక విషయంలో అంత కష్టాన్ని ఊహించలేకపోయాను. నా కోరికను చంపుకున్నాను. నచ్చినట్టు ఉండమని వదిలేశాను. ఆ తర్వాత తను ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ లోకి వచ్చింది."

ఇక తను అమాంతం బరువు తగ్గడంపై కూడా నాగబాబు స్పందించారు. తన శరీరంపై తానే కొన్ని ప్రయోగాలు చేసుకున్నానని, అవి మంచి ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు. జులై వరకు ఆ ప్రయోగాలున్నాయని, తర్వాత తానేం చేశానో ప్రత్యేకంగా వీడియోల రూపంలో చెబుతానంటున్నారు నాగబాబు.

మే 18 నుంచి కొత్త రూల్స్ తో లాక్ డౌన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?