లాక్డౌన్కి ముందు నాని తన సినిమాలను అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. మార్చిలో వి రిలీజ్ అయ్యేట్టు, జులైలో టక్ జగదీష్, డిసెంబర్లో శ్యామ్ సింగ రాయ్ వచ్చేట్టు ప్రణాళిక వేసుకున్నాడు.
అసలు విరామం లేకుండా ఆర్గనైజ్డ్గా సినిమాలు చేస్తూ ప్రతి రెండేళ్లకూ అయిదు లేదా ఆరు సినిమాలొచ్చేలా చూసుకునే నాని ప్లానింగ్ అంతా లాక్డౌన్తో అటు ఇటు అయింది.
లాక్డౌన్ సమయంలో తన సినిమా కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల కావాలనే పంతాలకు పోకుండా వి చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయించేసాడు.
ఆ సినిమా నిరాశ పరచడంతో అది మంచి నిర్ణయమయిందని అంతా అనుకున్నారు. షూటింగులు మళ్లీ ఊపందుకుంటోన్న టైమ్లో ‘టక్ జగదీష్’ను ముందుగా మొదలు పెట్టేసాడు. ఈ చిత్రం రిలీజ్ డేట్ పట్ల స్పష్టత లేదు కానీ జనవరి నుంచి ఏప్రిల్లోగా ఎప్పుడొచ్చినా ఫరక్ పడదు.
శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి నిర్మాత మారినా కానీ డిసెంబర్లో మొదలు పెట్టి జూన్ లేదా జులై నాటికి విడుదల చేసేలా చూసుకుంటున్నాడు. ఈలోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మలయాళ నటి నాజ్రియా ఫహాద్ కథానాయికగా మరో సినిమా అనౌన్స్ చేసాడు.
ఇది శ్యామ్ సింగరాయ్ అనరతరం మొదలయి వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదలవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా హీరోలు తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసుకోవడానికే ఆలోచనలో వుంటే నాని ఎప్పటిలా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.