ప్రేమించడానికి అవకాశం దొరకలేదంటున్న హీరో

యంగ్ ఏజ్ లో అందరికీ ప్రేమకథలుంటాయి. కాకపోతే కొందరు దాన్ని బయటకు చెప్పుకుంటారు. చాలామందికి మాత్రం వన్-సైడ్ లవ్ ఉంటుంది. తన కాలేజీ డేస్ లో లవ్ లైఫ్ గురించి స్పందించాడు హీరో నాని.…

యంగ్ ఏజ్ లో అందరికీ ప్రేమకథలుంటాయి. కాకపోతే కొందరు దాన్ని బయటకు చెప్పుకుంటారు. చాలామందికి మాత్రం వన్-సైడ్ లవ్ ఉంటుంది. తన కాలేజీ డేస్ లో లవ్ లైఫ్ గురించి స్పందించాడు హీరో నాని. ఆశ్చర్యకరంగా తనకు ఎలాంటి ప్రేమానుభవాలు లేవని చెబుతున్నాడు.

'హాయ్ నాన్న' సినిమా ప్రమోషన్ లో భాగంగా కాలేజ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు ఈ హీరో. తన తాజా చిత్రంలో టన్నుల కొద్దీ ప్రేమ ఉందని, యూత్ బాగా కనెక్ట్ అవుతారని అంటున్నాడు. హీరోగా మారిన తర్వాత వెండితెరపై చాలా ప్రేమ సన్నివేశాల్లో నటించిన నాని, రియల్ లైఫ్ లో మాత్రం తనకు అలాంటి అనుభవం లేదని చెబుతున్నాడు.

కాలేజ్ లైఫ్ లో కదిలించేంత అమ్మాయి కనిపించలేదని, పైగా అప్పట్లో తమకు ప్రేమించేంత సీన్ కూడా లేదని ఒకింత బాధ వ్యక్తం చేశాడు. ఈ కాలేజ్ మాత్రం కళకళలాడుతోందని, అబ్బాయిలకు చాలా ఛాన్సులు దొరుకుతాయంటూ కాలేజ్ స్టూడెంట్స్ ను ఉద్దేశించి అన్నాడు.

వచ్చేనెల 7న థియేటర్లలోకి వస్తోంది హాయ్ నాన్న సినిమా. జెర్సీలో తండ్రికొడుకుల ప్రేమను చూపించిన నాని, ఈ సినిమాలో తండ్రి-కూతురు ప్రేమను చూపించబోతున్నాడు. దాంతో పాటు, మృణాల్ తో ఓ మంచి లవ్ ట్రాక్ కూడా ఉంటుందని ఊరిస్తున్నాడు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి లిరికల్ వీడియోస్ రిలీజ్ కార్యక్రమం నడుస్తోంది. అయితే ఓవైపు ఇలా సాంగ్స్ రిలీజ్ చేస్తూనే, మరోవైపు సినిమాకు ప్రచారం కూడా స్టార్ట్ చేశాడు నాని. సాంగ్స్ లాంచ్ తో పాటు తను కూడా గ్రౌండ్ ఈవెంట్స్ స్టార్ట్ చేశాడు.