తనకు సంబంధం లేని విషయంలో ట్రోలింగ్ కు గురవుతున్నాడు నాని. కల్కిలో ప్రభాస్ ను జోకర్ తో పోల్చాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి. అది తప్పు అని చెప్పాడు నాని. అర్షద్ భారీ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నాడని, అతడి కామెంట్స్ ను లైట్ తీసుకోవచ్చంటూ విమర్శించాడు.
నాని కామెంట్స్ నార్త్ జనాలకు నచ్చలేదు. అతడిపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. దేశవ్యాప్తంగా పాపులారిటీలో నానికి, అర్షద్ కు అస్సలు పోలిక లేదంటూ చెప్పుకొస్తున్నారు.
కొంతమందయితే నాని చేసిన తాజా సినిమాలోని పాత్రను, అర్షద్ పోషించిన సర్క్యూట్ పాత్రను పక్కపక్కన పెట్టి.. ఆన్ లైన్ పోల్స్ కూడా చేస్తున్నారు.
ఇలా ఓవైపు తనపై ట్రోలింగ్ నడుస్తుండగానే ముంబయిలో ల్యాండ్ అయ్యాడు నాని. తన తాజా చిత్రం సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ముంబయి కీలకమైన మీడియా సంస్థలన్నింటినీ కవర్ చేశాడు.
ఈ సందర్భంగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించాడు. అర్షద్ పై తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపిన నాని, పదాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.
“మేం ప్రేమించే వ్యక్తిపై ఎవరో ఏదో కామెంట్స్ చేస్తే.. దాంతో మాకు సంబంధం లేకపోయినా రియాక్ట్ అవుతాం. ఈ విషయంలో ఫ్యాన్స్ అయినా, ఆడియన్స్ అయినా, యాక్టర్స్ అయినా ఒక్కటే. ప్రభాస్ ను మేమంతా ప్రేమిస్తాం. కేవలం పెద్ద సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ప్రభాస్ పెద్ద హీరో అయిపోలేదు. ఇన్నేళ్లుగా అతడి వ్యక్తిత్వం, చూపిస్తున్న వినయం వల్ల కూడా బిగ్ స్టార్ అయ్యాడు. అతడ్ని మేమంతా ఓన్ చేసుకున్నాం. అలాంటి వ్యక్తిపై విమర్శ వస్తే ఎవరైనా రియాక్ట్ అవుతారు.”
ప్రస్తుతం సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో ఉన్న నాని.. ఉన్న ఈ కొద్ది రోజులు పూర్తిగా తన సినిమా ప్రచారంపైనే దృష్టి పెడుతున్నానని, ఎలాంటి వివాదాల జోలికి వెళ్లనని, ఇకపై తన సినిమా గురించి మాత్రమే మాట్లాడతానని స్పష్టం చేశాడు.
Haa. Nehitive publicity stunt by nani in the footsteps of bollywood, otherwise no reason to react. What a time and turn has come in పబ్లిసిటీ
vc estanu 9380537747
Call boy works 8341510897
Comments on prabhas is very bad
సరిపోదా శనివారం పబ్లిసిటీ కోసమే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు.
లేకుంటే ఎవరూ పట్టించుకోని విషయంపై పనిగట్టుకొని ఇతనెందుకు స్పందిస్తాడు
“సరిపోదా శనివారం” అని అడుగుతున్నాడు…
దానికి ప్రేక్షకులు “దూల తీరిందా, నీకో నమస్కారం” అని తీర్పునివ్వకుంటే నానికి అదే పదివేలు…
OREY NANI NUVVOKA SANTHALO CHINTHAKAYAVI NEEKENDUKURAA ANAVASARAMINA VISHAYALU…NEE CAPACITY PITHANTHA
జనం పట్టించుకోరు